జుట్టు.. ఈ జుట్టు సమస్య ప్రతి అమ్మాయికి ఏదొక రకంగా ఉంటుంది. కొందరికి చుండ్రు సమస్య ఉంటుంది.. మరికొందరికి జుట్టు రాలడం సమస్య ఉంటుంది. మరికొందరి జుట్టు నిర్ జ్జివంగా మారిపోతుంది. ఇలా ఏదో ఒక జుట్టు సమస్య ప్రతి ఆడవారికి ఉంటుంది. అయితే కొందరు ఈ సమస్య తగ్గించుకోడానికి డాక్టరు దగ్గరకు వెళ్తే.. 

   

మరి కొందరు కెమికల్స్ ఉన్న కాస్మెటిక్స్ వాడుతారు.. మరికొందరు ఇంట్లోనే సహజసిద్ధమైన వాటితో హెయిర్ ప్యాక్ వేసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ వారి హెయిర్ ప్యాక్ ఎంతమాత్రం పనిచెయ్యదు. అలాంటి వారు తలస్నానం ఇలా చెయ్యండి. ఆరోగ్యకరమైన జుట్టును పొందండి. 

        

1. గోరువెచ్చని కొబ్బరినూనె లేదా నువ్వులనూనెను మాడుకు, కుదుళ్లకు పట్టించి బాగా మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత జుట్టుకంతా నూనె రాయాలి. ఇలా చేయ్యడం వల్ల ప్రెషర్ తగ్గుతుంది. 

   

2. ఆ తర్వాత టర్కీ టవల్‌ను వెచ్చని నీటిలో ముంచి, పిండి, తలకు చుట్టుకోవాలి. ఇలా ఆవిరి టవల్ తలకు కట్టుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగై కుదుళ్లు చురుకు అవుతాయి. ఈ విధంగా నెలకు ఒకసారైనా జుట్టుకు ఆవిరిపట్టాలి. దీని వల్ల వెంట్రుకల రాలడం సమస్య క్రమంగా తగ్గుతుంది. 

 

3. ఆ తర్వాత జుట్టు తడిలేకుండా త్వరగా ఆరాలని డ్రయ్యర్‌ని ఉపయోగించకుండా మెత్తటి కాటన్‌ లేదా టర్కీ టవల్‌ని ఉపయోగించడమే మంచి మార్గం. తలకు టవల్‌ చుట్టి కాసేపు వదిలేయాలి. తడిని టవల్‌ పీల్చుకుని, జుట్టు పొడిగా అవుతుంది. 

 

4. అంతేకాదు జుట్టు మెరవాలని హెయిర్‌ స్ప్రేలు వాడకూడదు. వీటి వల్ల వెంట్రుకలు సహజత్వాన్ని కోల్పోయి, మరింత పొడిబారుతాయి. వెంట్రుకలు చిట్లే సమస్య కూడా పెరుగుతుంది. 

 

చూసారుగా ఈ చిట్కాలను పాటిస్తే ఆరోగ్యకరమైన అందమైన జుట్టు మీ సొంతం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: