కాకరకాయ తినడానికి చేదుగా ఉన్న సౌందర్యానికి మాత్రం తీపిగా ఉంటుంది. ఎక్కువ శాతం మంది కాకరకాయ చేదు ఉండటం వల్ల దూరం పెట్టేస్తుంటారు. చాలామంది కాకరకాయకు దూరంగా ఉంటారు. అయితే కాకరకాయ లాభాలు తెలిస్తే మాత్రం ఎంత రేటు అయినా సరే ఆరోగ్యం కోసం కొంటారు తింటారు.. 

 

అయితే ఈ కాకరకాయ ఆరోగ్యానికి ఔషధంలా పనిచేయడంతో పాటు అందాన్ని కూడా భారీస్థాయిలో పెంచుతుందు. యువ వయసులో వచ్చే మొటిమల నుంచి కాలుష్యానికి పాడయినా చర్మం వరుకు ప్రతి సమస్యకు కాకరకాయ దగ్గర ఒక మంచి చిట్కా ఉంది. అది ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కాకరకాయ నుంచి తీసిన రసాన్ని ముఖానికి రాసి 5 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా రోజుకి ఒకసారి చేయడం వల్ల కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. 

 

చర్మ దురద, వాపులతో తరచూ బాధ పడుతుంటే కాకరకాయ ముక్కలను తీసుకోని మిక్సీ చేసి పేస్ట్ ల తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ లో చిటికెడు పసుపు, ఒక స్పూన్ అలోవెరా జ్యుస్ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా చర్మ దురద, వాపులు తగ్గుముఖం పడుతాయి. 

 

కాకరకాయలో సగం ముక్కను తీసుకోని మెత్తగా పేస్ట్ ల చేయాలి. ఈ పేస్ట్ లో ఒక స్పూన్ జాజికాయ పొడి, ఒక స్పూన్ పెరుగు కలిప ఆ పేస్ట్ ని ముఖానికి రాసి 10 నిమిషాల తరవాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మొటిమల మచ్చలు, అవాంఛిత మొటిమలు పూర్తిగా మాయమవుతాయి. 

 

కాకరకాయ ముక్కలను నీటిలో వేసి మరిగించి.. ఆ నీటిలో కాటన్ బాల్ ని ముంచి దద్దుర్లు ఉన్న ప్రదేశంలో రాసి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే వేడి దద్దర్లు క్రమంగా తగ్గిపోతాయి. 

 

కాకరకాయ పేస్ట్ లో కరివేపాకు పొడి కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే దురద పూర్తిగా తగ్గిపోతుంది. 

 

చూశారుగా.. కాకరకాయతో సౌందర్యానికి సంబంధించి ఎన్ని అందమైన చిట్కాలు ఉన్నాయో.. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ చిట్కాలను పాటించి అందంగా తయారవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి: