కావలసిన పదార్థాలు:
ఉప్పు - రెండు టీస్పూన్స్
ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె - 3 టీస్పూన్స్
నిమ్మరసం - 1/2 టీస్పూన్
తయారీ విధానం:
ఒక చిన్నపాత్రలోకి ఉప్పును అలాగే నూనెను తీసుకుని బాగా కలపండి. ఇప్పుడు ఇందులో అర చెక్క నిమ్మరసాన్ని పిండండి. ఈ మిశ్రమాన్ని అరచేతులపై అప్లై చేసుకోండి. అలాగే చేతులకు వెనుకవైపున కూడా ఈ మిక్శ్చర్ ను అప్లై చేయండి. రెండు నుంచి మూడు నిమిషాలపాటు ఈ ప్రాసెస్ ను ఫాలో అవ్వాలి. ఆ తరువాత ఐదు నిమిషాలపాటు చేతులపై ఈ సొల్యూషన్ ఉండేలా చూసుకోవాలి. ప్లెయిన్ వాటర్ తో వాష్ చేయాలి.
ఇక అలాగే ఈ పద్ధతులు కూడా పాటించండి...
చేతులను విపరీతంగా డ్రైగా మార్చే సోప్స్ లేదా డిటర్జెంట్స్ ను పూర్తిగా అవాయిడ్ చేయండి.
నీళ్ళల్లో ఎక్కువసేపు పనిచేయాల్సి వచ్చినప్పుడు చేతులకు గ్లోవ్స్ ను తప్పనిసరిగా వేసుకోండి.
గాలిలోని తేమశాతాన్ని నిలిపి ఉంచేందుకు మీ రూమ్ లో హ్యుమిడిఫయర్ ను ఏర్పాటు చేసుకోండి.
ఎయిర్ డ్రయర్స్ తో చేతులను డ్రై చేసుకునే అలవాటును మానుకోండి. టిష్యూస్ ను వాడండి.
వారంలో ఒక్కసారి చేతులను ఎక్స్ఫోలియేట్ చేసుకోండి. దాంతో, డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. చేతులు సాఫ్ట్ గా ఉంటాయి.
రోజూ చేతులను మాయిశ్చరైజ్ చేయండి.
ఈ కేర్ తో చేతుల సౌందర్యాన్ని పరిరక్షించుకోవచ్చు.
ఇక ఈ పద్ధతులు పాటిస్తే మీ చేతులు మృదువుగా, అందంగా తయారవుతాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి