ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..చలికాలంలో మన జుట్టుకి చాలా సమస్యలు వస్తాయి. చుండ్రు, దురద, రాలిపోవడం వంటి సమస్యలు తరచూ వస్తూ ఉంటాయి. ఇక ఈ పద్ధతులు పాటిస్తే ఖచ్చితంగా ఎలాంటి జుట్టు సమస్యలు రావు.చలి కాలంలో వాతావరణం మార్పు వల్ల జుట్టు షైనింగ్ కోల్పోతుంది. మీ జుట్టు మెరుస్తూ మరియు సిల్కీగా ఉండటానికి, ప్లాస్టిక్ దువ్వెన కాకుండా చెక్కతో చేసిన పళ్ళు వేడవెడంగా ఉన్న దువ్వెను ఉపయోగించండి. కొంచెం తేనెను జుట్టు మొత్తానికి రాయండి. తేనే రాసిన తరువాత కొంచెం జిగురుగా అనిపించినప్పటికీ ఇది బాగా పనిచేస్తుంది. ఇలా తేనే రాసిన తరువాత మీ తలను షవర్ క్యాప్ తో కప్పి 30 నిమిషాలు ఉంచండి.


30 నిముషాల తరువాత మీరు షాంపూ మరియు గోరువెచ్చని నీటితో వాష్ చెయ్యాలి. తేనె రాయడం వల్ల ఎప్పుడైనా జుట్టుకి షైనింగ్ వస్తుంది.చలికాలంలో తలపై చర్మం పొడిమారడం మరియు దురద సాధారణంగా వస్తాయి. శీతాకాలంలో చల్లటి వాతావరణం వల్ల తలపై చుండ్రు సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యను తగ్గించడానికి మరియు పూర్తిగా నివారించడానికి, కొన్ని టేబుల్ స్పూన్ల ఆలివ్ లేదా కొబ్బరి నూనెను ఒక టీస్పూన్ నిమ్మరసంతో కలపండి. ఈ మిశ్రమాన్ని కొన్ని సెకన్ల పాటు వేడి చేసి, ఆ తరువాత తలపై ఆ నూనె అప్లై చేసి మసాజ్ చేయండి. 30 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత షాంపూ లేదా కండీషనర్‌తో వాష్ చెయ్యాలి. ఇలా ప్రతి వారం రెండుసార్లు చేయండి.


ఇది చాలా ఈజీగా ఉంటుంది మరియు బాగా పని చేస్తుంది.కండీషనర్ లేని షాంపూ పనికిరాదు. మీకు నచ్చిన షాంపూని కొనేటప్పుడు, కండీషనర్‌ను కూడా తప్పకుండ కొనండి. ఏదేమైనా, మీరు మీ జుట్టును వాష్ చేసుడుకోవడం తప్పనిసరి. షాంపూ తలమీద పనిచేస్తుంది. అయితే, కండీషనర్ జుట్టు కోసం పని చేస్తుంది.చాలా మంది జుట్టును అరబెట్టడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది జుట్టు తడిగా ఉన్నప్పుడే దువ్వుతారు. మరికొందరు దానిని టవల్ తో కప్పి కడతారు, కొంతమంది హెయిర్ డ్రైయర్ వాడుతారు. నిజం చెప్పాలంటే, మీ జుట్టు ఆరడానికి ఏమి చేయకూడదు సహజంగా జుట్టును ఆరనివ్వాలి.


మీకు సమయం ఉంటే సహజంగా ఆరనివ్వాలి లేకపోతే తడిగా ఉన్నపుడు జుట్టును దువ్వుతే జుట్టు పొడిమారిపోతుంది, చివరలు స్ప్లిట్ అవుతుంది. జుట్టును ఆరబెట్టడానికి ఉత్తమమైన మార్గం ఏమిటంటే, శుభ్రమైన టవల్ ఉపయోగించి నీటిని పిండి వెయ్యాలి మరియు వేడి గాలితో కాకుండా చల్లటి గాలితో ఆరనివ్వాలి.ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో సౌందర్య చిట్కాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: