ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. చాలా మంది ఎంత ప్రయత్నించినా కాని చుండ్రు సమస్య నుంచి బయటపడలేరు. ఎన్ని పద్ధతులు పాటించిన ఇంకా వారిని చుండ్రు సమస్య వేధిస్తూనే ఉంటుంది. అలా చుండ్రు సమస్యతో బాధ పడేవారు ఈ ఇంటి చిట్కాలని పాటించండి. ఖచ్చితంగా చుండ్రు సమస్య ఉండదు...చిన్న అల్లం ముక్కను సన్నని ముక్కలుగా తరిగి నువ్వల నూనెలో వేయండి. ఆ నూనెతో తలకు మర్దనా చేసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు తలకు రాసుకొని ఉదయానే షాంపూతో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చుండ్రు తగ్గుముఖం పడుతుంది.రాత్రి మెంతుల్ని నీటిలో నానబెట్టి.. ఉదయాన్నే రుబ్బండి. అనంతరం ఆ మిశ్రమాన్ని తలకు పట్టించండి. ఓ గంటసేపు ఆగి షాంపూతో తలంటుకోండి. ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గడమే కాకుండా మాడు కూడా చల్లబడుతుంది.

కలబంద గుజ్జును మాడుకు పట్టించి పావుగంట తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోండి. వారానికి మూడు సార్లు ఇలా చేయడం వల్ల సమస్య  తగ్గడమే కాకుండా వెంటుకలు మృదువుగా మారతాయి.వేప నూనె, ఆలివ్ ఆయిల్‌ను సమాన మోతాదులో కలిపి వేడి చేయండి. గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఆ మిశ్రమాన్ని వెంటుకలకు, మాడుకు రాసుకోండి. పావుగంట తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోండి.ఇక ఇలాంటి సౌందర్య చిట్కాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో సౌందర్య చిట్కాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: