కొరియన్స్ తమ స్కిన్ కేర్ రొటీన్ తో ఆల్రెడీ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నారు. బేబీ వంటి స్మూత్ అలాగే హైడ్రేటెడ్ స్కిన్ వారి సొంతం. గ్లాస్ స్కిన్ కి కొరియన్స్ పెట్టింది పేరని చెప్పుకోవచ్చు. గ్లాస్ స్కిన్ కే డాల్ఫిన్ స్కిన్ అని కూడా పేరు. గ్లాసీ స్కిన్ ను సొంతం చేసుకోవాలంటే వివిధ స్కిన్ కేర్ ఇష్యూస్ కు గుడ్ బై చెప్పేయాలి. స్కిన్ కేర్ రొటీన్ ను అర్థం చేసుకోవాలి. చర్మ సంరక్షణపై దృష్టి పెట్టాలి.

గ్లాస్ స్కిన్ లేదా డాల్ఫిన్ స్కిన్ కోసం పాటించాల్సినవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్లీన్సింగ్ తో ప్రారంభించండి:

డబుల్ క్లీన్సింగ్ కు ప్రాధాన్యతనివ్వాలి. స్కిన్ పై పేరుకుపోయిన దుమ్ము, ధూళి అలాగే జిడ్డును తొలగించడం ముఖ్యం. నేచురల్ మాయిశ్చర్ ను నిలిపి ఉంచడానికి ఆయిల్ క్లీన్సర్ లేదా స్కిన్ బామ్ ను వాడటం మంచిదని నిపుణుల సలహా.

ఎక్స్ఫోలియేషన్:

స్కిన్ సర్ఫేస్ స్మూత్ గా మారేందుకు ఎక్స్ఫోలియేషన్ హెల్ప్ చేస్తుంది. వాటర్ బేస్డ్ ఎక్స్ఫోలియేటర్ ను వాడటం మంచి ఐడియా. ఇది స్కిన్ పై జెంటిల్ గా ఉంటుంది. ఇది స్కిన్ లోని నేచురల్ ఆయిల్ పై దుష్ప్రభావం చూపించదు.

హైడ్రేషన్:

డాల్ఫిన్ స్కిన్ ను పొందాలంటే స్కిన్ హైడ్రేషన్ పై దృష్ట పెట్టాలి. ప్రైమర్, టోనర్, సెరమ్, హైడ్రేటింగ్ మాయిశ్చర్, ఫేస్ మిస్ట్ అలాగే ఎస్పీఎఫ్ లను డైలీ రొటీన్ లో వాడాలి. వీటిని డైలీ రొటీన్లో వివిధ ఇంటెర్వల్స్ లో వాడటం వల్ల స్కిన్ హైడ్రేటెడ్ గా ఉంటుంది.

సరైన డైట్:

సమతులాహారంతో పాటు తగినంత ఫ్లూయిడ్స్ ను అలాగే నీళ్లను తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. గ్రీన్ వెజిటబుల్స్ ను, ఫ్రూట్స్ ను అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న ఫుడ్స్ ను తీసుకుంటే స్కిన్ హెల్త్ మరింత మెరుగవుతుంది.

శారీరక వ్యాయామం:

యోగాతో పాటు ఫ్రెష్ ఎయిర్లో బ్రిస్క్ వాక్ అనేది స్కిన్ కేర్ కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కోరియన్స్ డాల్ఫిన్ స్కిన్ ట్రెండ్ ను మీరు కూడా ఫాలో అవ్వండిలా...!

మరింత సమాచారం తెలుసుకోండి: