చాలా మంది అమ్మాయిల ముఖం మీద సన్నని వెంట్రుకలు ఉంటాయి. అందంపై ఎక్కువ శ్రద్ధ తీసుకునే వారు వీటిని క్రమం తప్పకుండా  తొలగిస్తుంటారు. కొంతమంది అమ్మాయిలు అయితే పార్లర్‌కి వెళ్లి వాటిని తొలగించుకుంటే కొందరు మాత్రం ఇంట్లో రేజర్‌తో తీసేస్తారు.అయితే పార్లర్ ఫేషియల్ హెయిర్ రిమూవల్ అనేది చాలా కష్టమైన పని.అలాగే రేజర్‌తో రెగ్యులర్ హెయిర్ రిమూవల్ కూడా మొహానికి అంత మంచిది కాదు. ఇది చర్మానికి నిజంగా చాలా హాని కలిగిస్తుంది. నిజానికి మన ముఖం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ముఖానికి రేజర్ ని ఎక్కువగా ఉపయోగించకపోవడమే మంచిది.చాలా మందికి కూడా ఎక్కువ జుట్టు ముఖ్యంగా పై పెదవిపై ఉంటుంది. ఈ అన్‌వాంటెడ్‌ హెయిర్‌ తొలగించడానికి చర్మ నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. వీటిని ఇంట్లోనే కొన్ని పదార్థాలను మిక్స్ చేసి ప్యాక్‌లా తయారు చేసుకోని వాడి తొలగించుకోవచ్చు. ఈ టిప్స్ తో ముఖంపై వెంట్రుకలను సులువుగా తొలగించుకోవచ్చు.


పసుపులో కొంచెం బేకింగ్ సోడా కలుపుకోవాలి. దీనిలో అర స్పూన్‌ బియ్యప్పిండి వేసి, కాసిన్నీ నీళ్లు పోపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని జుట్టు పెరిగే చోట అప్లై చేసుకోవాలి. ఈ చిట్కా కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ చిట్కా నాలుగు రోజులు క్రమం తప్పకుండా ట్రై చేయాలి. ఎందుకంటే ఒక్కరోజులో ఆ వెంట్రుకలన్నీ రాలిపోవు. ఇది పూర్తిగా న్యాచురల్ పద్ధతి.అలాగే ఉల్లిపాయ, కోల్గేట్ కలిపితే జుట్టు కుదుళ్ల మూలాలు మృదువుగా మారుతాయి. ఈ మిశ్రమంలో ఒక చెంచా బియ్యప్పిండి కూడా కలుపుకోవాలి. మిశ్రమానికి కొంచెం నీరు కలపాలి. ఈ పేస్ట్‌ను వెంట్రుకలు ఉన్న చోట పట్టించి, 15 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి.ఇలా మూడు నుంచి నాలుగు రోజుల పాటు నిరంతరం అప్లై చేసి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. చేతితో ఎంత బాగా స్క్రబ్ చేస్తే అంత మంచిది. తర్వాత తడి గుడ్డతో ముఖాన్ని తుడుచుకోవాలి. హెయిర్ ఫోలికల్ బలహీనపడిన తర్వాత అక్కడ మళ్ళీ కొత్త జుట్టు పెరగదు.ఉల్లిపాయని కట్ చేసి తురుము వేసుకొని ఒక స్పూన్‌ ఉల్లిపాయ రసం, జామ రసంలో ఐదు చుక్కల నిమ్మరసం, కొద్దిగా కోల్గేట్ పేస్ట్ కలపాలి. ఈ మిశ్రమాన్ని మూడు నుంచి నాలుగు రోజుల పాటు అప్లై చేయాలి.అలా చేస్తే ముఖం పై వెంట్రుకలు చాలా ఈజీగా తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: