తస్లీమా నస్రీన్ (బెంగాలీ, బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ రచయిత్రి, స్త్రీవాద మానవ హక్కుల కార్యకర్త, సెక్యులర్ వాది. తస్లీమా రచయిత్రిగా ప్రపంచ ప్రసిద్ధి పొందారు. అయితే బ‌త‌క‌డానికి మాత్రం ఆమె ఇంకా దేశాల వెంట తిరుగుతూనే ఉన్నారు. ఏ దేశమూ ఆమెకు శాశ్వ‌త పౌర‌స‌త్వం ఇవ్వ‌డానికి సాహ‌సించ‌లేక‌పోయింది. ముస్లిం చాంధసవాదుల నుంచి ముప్పు ఎదుర్కొంటుంది. ఆమెపై ఫత్వా జారీ చేయడమే కాక ఆమె తలపై వెల కట్టారు. ముస్లిం చాంధసవాదులు.  బంగ్లాదేశ్ నుండి వచ్చి కోల్‌కతలో నివాసం ఏర్పర్చుకుంది. ఆ తరువాత చాందసవాదులు ఆందోళన చేయడంతో భారత ప్రభుత్వం ఢిల్లీలో ఆశ్రయం కల్పించింది. 2008, మార్చి 20న భారత్‌ను వదిలి గుర్తుతెలియని ప్రదేశానికి పయనించింది.


1962, ఆగష్టు 25 న బంగ్లాదేశ్ లోని మైమెన్‌సింగ్ లో జన్మించింది. ముస్లిం కుటుంబంలో పుట్టి, ముస్లింగా పెరిగినప్పటికీ చదువు, వయస్సు పెరిగే కొద్దీ ఆమె హేతువాదిగా, నాస్తకురాలిగా మారింది. 1994 వరకు ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేసింది. 1990 నుండి తన అభ్యుదయవాద రచనలతో ప్రపంచ ప్రసిద్ధి పొందింది. 1994లో స్వేచ్ఛా అభిప్రాయాలకు గాను యూరోపియన్ పార్లమెంటు నుంచి సఖరోవ్ బహుమతిని, 1996లో మానవతా అవార్డు పొందింది. ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపినందుకు ఇస్లాం లేఖనాలను విమర్శించినందుకు 1993 నుంచి ఇస్లాం ఛాందసవాదులు ఆమెను చంపాలని చూస్తున్నారు.


2007లో ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాదులో ఒక రచయితల సదస్సులో పాల్గొనడానికి వచ్చిన సందర్భంలో మజ్లిస్ పార్టీకి చెందిన ఇస్లాం చాందసవాదులు ఆమెపై దాడిచేశారు. సెప్టెంబర్ 2007 లో పశ్చిమ బెంగాల్లో ఆమెను భారతదేశం నుంచి బహిష్కరించాలని ప్రదర్శనలు చేశారు. ఆమెకు భారత పౌరసత్వం ఇవ్వొద్దని ఇలాంటి వర్గాలే కోరుతున్నాయి. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతిస్పందింస్తూ బంగ్లాదేశ్‌లో హిందువులపై ముస్లింలు జరిపిన దాడులకు వ్యతిరేకంగా వ్రాసిన లజ్జా అనే నవల కూడా చాలా వివాదాస్పదమయ్యింది. ఆమెకు ర‌చ‌న‌లను కొనియాడుతూ ప్ర‌పంచంలోని చాలా దేశాలు, సంస్థ‌లు ఆమెను అవార్డులు, రివార్డుల‌తో స‌త్క‌రించారు. ఆమెకు బాగా పేరు తెచ్చిన న‌వ‌ల‌ల్లో ల‌జ్జ ప్ర‌ధాన‌మైంద‌ని చెప్పాలి. ఇందులో బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల‌పై జ‌రిగిన దాడుల‌ను ఆమె చ‌ర్చించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: