ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్నేయ బంగాళ ఖాతంలో ఏర్పడిన అంఫన్ తుఫాను బలపడిన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తుఫాన్ అంఫన్ నిన్న మధ్యాహ్నం 2.30 గంటలకు అతి తీవ్ర తుఫాన్ గా మారింది. భారత వాతావరణ విభాగం అంఫన్ ఈరోజు సాయంత్రానికి అత్యంత తీవ్ర తుఫాన్ గా మారనుందని హెచ్చరించింది. 
 
అంఫాన్ ప్రభావంతో ఏపీలో మరో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈరోజు, రేపు ఈదురుగాలులు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని... విశాఖపట్నం సైక్లోన్ వార్నింగ్ సెంటర్ డైరెక్టర్ భాస్కర్ తెలిపారు. రాష్ట్రంలోని గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రెండో హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలోకి నిన్న నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: