క‌రోనా కాటుకు మ‌రో ప్ర‌ముఖుడు క‌న్నుమూశారు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అస్సాం ప్రముఖ రచయిత హోమెన్‌ బర్గోహెయిన్‌ (88) కరోనాతో బాధపడుతూ కన్నుమూశారు. కరోనాతో హోమెన్ బొర్గోహైన్ బుధ‌వారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు. 88 ఏండ్ల బొర్గోహైన్ గ‌త నెల 24న క‌రోనా పాటివ్‌గా నిర్ధార‌ణ అయ్యారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మే 7న క‌రోనా నెగెటివ్ రావ‌డంతో ద‌వాఖాన నుంచి డిశ్చార్జీ అయ్యారు. అయితే క‌రోనా స‌మ‌స్య‌ల‌తో ఇవాళ ఉద‌యం గువాహ‌టీలోని ఓ న‌ర్సింగ్‌లో చేరాయి. చికిత్స పొందుతుండ‌గా గుండెపోటు రావడంతో ఆయ‌న మృతిచెందారు. ఆయన మృతితో అసోం సాహిత్య లోకం మూగబోయింది. హోమెన్‌ బర్గోహెయిన్‌ మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంతాపం ప్రకటించారు. అధికారికంగా అంత్యక్రియలు జరిపించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అసోంకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: