నేడు ప్రపంచ పురుషుల దినోత్సవం సందర్భంగా ఏపి సీఎం వైయస్ జగన్ తన క్యాంపు ఆఫీస్ కార్యాలయం లో పులుల సంరక్షణ కోసం తీసుకునే చర్యల గురించి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు.పులుల సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలని అధికారులకు వివరించారు సీఎం జగన్. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్ లో పులుల సంఖ్య పెరిగిందంటూ జగన్ కి తెలిపారు అధికారులు. గత ఏడాది 47 గా ఉన్న పులుల సంఖ్య ఇప్పుడు 63కి చేరిందని తెలిపారు. నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకు కూడా పులులు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయని అధికారు వివరాలు వెల్లడించారు. కడప, చిత్తూరు ప్రాంతాల్లో సైతం పులులు కనిపిస్తున్నాయని తెలిపారు. పులుల సంరక్షణ కోసం పటిష్టమైన కార్యక్రమాలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. టైగర్‌ రిజర్వ్‌ప్రాంతాల్లో అధికారులకు, ఉద్యోగులకు వాహనాల కొనుగోలుకు సీఎం అంగీకారం తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: