టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరికి సాగిస్తున్న అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన గంగోత్రి మూవీ తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో అల్లు అర్జున్ కి తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజీ లభించింది. ఆ తర్వాత అనేక సినిమాలలో నటించిన అల్లు అర్జున్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. 

ఇకపోతే అల్లు అర్జున్ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా నిలిచిన మూవీ లలో ఆర్య మూవీ ఒకటి. ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్ లో రెండవ మూవీ గా వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అనురాధ మెహతా హీరోయిన్ గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తోనే సుకుమార్ దర్శకుడిగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు.

సినిమా మే 7 వ తేదీన 2004 వ సంవత్సరం థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి నేటికి 20 ఏళ్లు పూర్తి అవుతుంది. 20 ఏళ్లు కంప్లీట్ అయిన ఇప్పటికే కూడా ఈ సినిమా టీవీ లో ప్రసారం అయినప్పుడు అద్భుతమైన "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకుంటుంది. ఇలా 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ మూవీ లో శివ బాలాజీ , సునీల్ ముఖ్య పాత్రలలో కనిపించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: