లోక నాయకుడు కమల్ హాసన్ ఆఖరు గా లోకేష్ కనకరాజు దర్శకత్వం లో రూపొందిన విక్రమ్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు . ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాష లలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది . ఇక విక్రమ్ మూవీ తో ఫుల్ జోష్ లో ఉన్న కమల్ కొన్ని రోజుల క్రితమే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండియన్ 2 మూవీ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నాడు . ఈ మూవీ ని కొంత కాలం క్రితం జూన్ నెల లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కానీ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పనులు బ్యాలెన్స్ ఉండడంతో ఈ మూవీ ని జూన్ లో కాకుండా జులై నెలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక చాలా రోజుల క్రితమే కమల్ , మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ అనే మూవీ ని ప్రారంభించాడు. ఈ మూవీ కి సంబంధించిన ఒక వీడియోను కూడా విడుదల చేయగా దానికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఇన్ని రోజుల పాటు కమల్ తమివ్ళనాడు  బిజీ గా ఉండడం తో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.

 రీసెంట్ గానే తమిళ నాడు ఎలక్షన్స్ కంప్లీట్ కావడంతో మళ్లీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇకపోతే ఈ మూవీ లో శింబు ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం 10 గంటలకు ఈ మూవీ లో నటించబోయే ఓ నటుడి గురించి అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అది శంబు ఈ సినిమాలో నటించబోతున్నట్లు మూవీ యూనిట్ అధికారికం గా ప్రకటించబోయే అప్డేట్ అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: