సినీనటి ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మరొకసారి నగరి అసెంబ్లీ బరిలో వైసీపీ పార్టీ నుంచి పోటీ చేయబోతోంది. అయితే అక్కడ వైసిపి పార్టీ రెబల్స్ ఆమెకు చాలా తలనొప్పిగా మారడంతో ఇటీవలే రెబల్స్ పైన కూడా ఆగ్రహాన్ని తెలియజేస్తూ ఉన్నది రోజా.. ముఖ్యంగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి అందరూ ఏకమయ్యారు అన్న ఆమె.. ఎంతమంది ఒకటైన సరే పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గానే వస్తుందని తెలుపుతోంది.. ముఖ్యంగా జగనన్న బాగుంటేనే మనం బాగుంటాం మన కుటుంబాలు కూడా బాగుంటాయి అనే విషయాన్ని సూచించింది రోజా.


అలాగే తన అడుగులు కూడా హ్యాట్రిక్ వైపుగానే వేస్తున్నానని కచ్చితంగా ఈసారి గెలుపు తనదే నగరిలో అంటూ వెల్లడించింది.. మరొకవైపు నగరిలో తనకు వ్యతిరేక వర్గం పైన ఆగ్రహాన్ని కూడా వెల్లడించింది.. నగరి నియోజకవర్గంలో అన్ని పదవులు అనుభవించిన తరువాత క్వారీలో  ఆక్రమంగా సంపాదించుకొని తనను వెన్నుపోటు పొడిచారు అంటూ కూడా ఆరోపించింది రోజా.. తనను ఓడించడానికి ఒక్కటై నగరి టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ ను గెలిపించడానికి ఎక్కువగా తిరుగుతున్నారంటూ వెన్నుపోటు దారులకు త్వరలోనే బుద్ధి చెప్తారు ప్రజలు అంటూ తెలిపింది రోజా.


నగరి ప్రజలకు మంచి చేసిన తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.. అలాగే మరొకవైపు తన భర్త కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారని కచ్చితంగా ఈసారి కూడా విజయం సాధించి తీరుతానంటూ తెలుపుతోంది.. తన వర్గ వ్యతిరేక పోరుకు సైతం చెక్ పెడతానని నమ్మకం తనకు ఉందని కూడా వెల్లడించింది రోజా.. ముఖ్యంగా తనకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్స్ పెట్టినటువంటి నేతలపైన కూడా పార్టీకి ఫిర్యాదు చేసింది రోజా.. ఈ విషయంపైనే చర్యలు తీసుకునేలా కూడా చూస్తున్నట్లు సమాచారం. మరి రోజా అనుకున్నట్టుగానే ఈసారి హ్యాట్రిక్ సాధిస్తుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: