ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు కలిగి ఉన్న సినిమాలలో పుష్ప పార్ట్ 2 మూవీ ఒకటి. ఈ మూవీ యొక్క మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా రెండవ భాగాన్ని ఆగస్టు 15 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేసింది.

 దానికి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమా టీజర్ విడుదల అయిన చాలా తక్కువ రోజుల్లోనే ఈ మూవీ మేకర్స్ ఈ మూవీ లోని మొదటి సాంగ్ ను కూడా విడుదల చేశారు. దానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇకపోత ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఈ సినిమా టీజర్ మరియు ఫస్ట్ సాంగ్ అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇప్పటి వరకూ ఈ మూవీ టీజర్ కి యూట్యూబ్ లో 130 మిలియన్స్ వచ్చాయి.

అలాగే ఈ మూవీ లోని ఫస్ట్ సింగిల్ కు అన్ని భాషల్లో కలిపి ఇప్పటి వరకు యూట్యూబ్ లో 63 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇలా ఇప్పటి వరకు పుష్ప పార్ట్ 2 నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇక రష్మిక మందన ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా నటిస్తూ ఉండగా ... సుకుమార్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్న ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అనసూయ , సునీల్ , రావు రమేష్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: