నేటి ఆధునిక సమాజంలో బాల్య వివాహాలు అనేవి పూర్తిగా తగ్గి పోయాయి అన్న విషయం తెలిసిందే. ఎక్కడో ఓచోట ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే ఇలా బాల్యవివాహాలు జరగకుండా ఎప్పటికప్పుడు పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఎవరైనా చట్ట ప్రకారం ఇక పెళ్లికి సరిపడా వయసు రాకముందు వివాహం చేస్తూ ఉంటే.. ఆ పెళ్లిలను అడ్డుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పాలీ.


 కానీ నేటి ఆధునిక సమాజం లో కూడా ఇంకా అనాగరిక ఘటనలు అక్కడక్కడ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇంకా రాచరికం లోనే కొంత మంది జీవనం సాగిస్తున్నారని.. ఇలా వెలుగులోకి వచ్చే ఘటనల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించి ఆ బాలిక వయసు 13 ఏళ్లు ఇంకా స్కూల్ చదువును కూడా పూర్తి చేయలేదు. లోకం తీరును కూడా పూర్తిగా అర్థం చేసుకోలేదు. కానీ అలాంటి బాలికకు పెళ్లి చేయడానికి రెడీ అయ్యారు తల్లిదండ్రులు. అది కూడా 70 ఏళ్ల వయస్సు ఉన్న వృద్ధుడితో.


 ఈ ఘటన కాస్త సంచలనం గా మారి పోయింది. అయితే మన దేశంలో కాదు భారత పొరుగు దేశమైన పాకిస్థాన్ లో ఈ దారుణం వెలుగు చూసింది. కైబర్ ఫక్తున్వ ప్రావిన్స్ లో స్వాత్ లోయలో 13 ఏళ్ల బాలికను 70 ఏళ్లవృద్ధుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన కాస్త సంచలనం  గా మారి పోయింది. ఈ క్రమం లోనే ఆ బాలిక తండ్రి తో పాటు ఇక ఇలా పెళ్లి చేసుకున్న వృద్ధుడిని.. ఇక పెళ్లి జరిపించిన అధికారిని కూడా పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. కాగా పాకిస్తాన్లో ఆడపిల్లలకు వివాహ వయస్సు 16 ఏళ్లుగా ఉండగా.. అబ్బాయిలకు 18 ఏళ్లుగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: