కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ధనుష్ ఒకరు. ఇకపోతే ఈయన ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. కేవలం తమిళ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ధనుష్ ఇతర ఇండస్ట్రీ లలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగు లో కూడా విడుదల అయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకోవడంతో ఈ నటుడికి తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. 

ఇకపోతే ఇప్పటికే ఈయన తెలుగు దర్శకుడు అయినటువంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సార్ అనే సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. అలాగే ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ధనుష్ "రయాన్" అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు ఈయనే రచన మరియు దర్శకత్వం కూడా వహిస్తున్నాడు.

ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క మొదటి పాట విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ లోని మొదటి పాటను ఈ నెల 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: