2024 ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎంత మంచి ప్రదర్శన చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు కేవలం బౌలింగ్ విభాగంతో మాత్రమే నెట్టుకొచ్చిన సన్రైజర్స్.. ఇక ఈసారి బ్యాటింగ్ విభాగంలో కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది.  ఏకంగా ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా స్కోర్లు చేస్తూ ప్రత్యర్ధులకు వణుకు పుట్టిస్తుంది అని చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఈ ఐపీఎల్ సీజన్ లో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోరుని రెండుసార్లు బద్దలు కొట్టడంలో సక్సెస్ అయింది సన్రైజర్స్ జట్టు.


 అయితే ఐపీఎల్ ప్రారంభంలో వరస విజయాలు సాధిస్తూ దూసుకు వచ్చిన సన్రైజర్స్ ఇప్పుడు మాత్రం వరుస ఓటములతో సతమతమవుతుంది. కాగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ ఆరు విజయాలు సాధించింది అని చెప్పాలి. అయితే ఇటీవల ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కాస్త తడబాటుకు గురైన సన్రైజర్స్ చివరికి ఓటమిపాలు అయింది. ఒకానొక సమయంలో విజయం సన్రైజర్స్ వైపే ఉంది అని అనిపించినప్పటికీ.. ఆ తర్వాత ముంబై ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ సెంచరీ తో చెలరేగి పోవడంతో  హైదరాబాద్ జట్టుకు ఓటమి తప్పలేదు.


 అయితే ఈ మ్యాచ్ లో అటు సన్ రైజర్స్ ఓడిపోయినప్పటికీ ఆ జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతున్న భువనేశ్వర్ కుమార్ మాత్రం ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన రెండో బౌలర్గా రికార్డును కోల్పోయాడు. ఇప్పటివరకు ఏకంగా 14 మేయిడెడ్ ఓవర్లు వేశాడు భువనేశ్వర్ కుమార్  ఈ క్రమంలోనే ప్రవీణ్ కుమార్ 14 మేయిడేడ్ ఓవర్ల రికార్డును సమం చేశాడు అని చెప్పాలి. వీరి తర్వాత ట్రెండ్ బౌల్డ్ 11, ఇర్ఫాన్ పఠాన్ 10, లసిద్ మలింగ 8, బుమ్రా 8 మెయిడెడ్ ఓవర్లతో టాప్ ఫైవ్ లిస్టులో కొనసాగుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl