ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు థియేటర్ లలో విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. అలా ఈ వారం తెలుగు లో మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ మూడు సినిమాలు ఏవి అనే విషయాన్ని తెలుసుకుందాం.

కృష్ణమ్మ : తెలుపు సినీ పరిశ్రమలో నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న సత్యదేవ్ తాజాగా కృష్ణమ్మ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని మే 10 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని కొరటాల శివ సమర్పిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా అందులో చాలా వరకు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ప్రతినిధి 2 : నారా రోహిత్ కొంత కాలం క్రితం ప్రతినిధి అనే సినిమాలో హీరో గా నటించే మంచి విజయం అందుకున్నాడు. ఇక తాజాగా నారా రోహిత్ ప్రతినిధి మూవీ కి కొనసాగింపుగా రూపొందిన ప్రతినిధి 2 మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమా మే 10 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. మూర్తి దేవగుప్తపు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మే 10 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ప్రతినిధి మూవీ కి కొనసాగింపుగా రూపొందిన మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ మూవీ బృందం ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై జనాల్లో అంచనాలు మరింతగా పెరిగాయి.

జితేందర్ రెడ్డి : విరించి వ‌ర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 10 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథతో రూపొందింది.

మే 10 వ తేదీన మొత్తం మూడు తెలుగు సినిమాలు థియేటర్ లలో విడుదల కావడానికి రెడీ గా ఉన్నాయి. మరి ఇందులో ఏ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మే 10 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: