లోక నాయకుడు కమల్ హాసన్ గత కొన్ని సంవత్సరాలుగా బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా చూపించలేకపోయాడు. అలాంటి సమయంలోనే కమల్ , లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

మూవీ తో కమల్ తిరిగి పూర్వ వైభవాన్ని అందుకున్నాడు. అలాగే వరుస సినిమాలను కూడా ఓకే చేస్తూ వస్తున్నాడు. ఇక ప్రస్తుతం కమల్ , మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ యొక్క షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. కాకపోతే ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి అయిన తర్వాత తమిళనాడు రాష్ట్రంలో ఎలక్షన్స్ రావడంతో కమల్ ఎలక్షన్ పనులతో బిజీగా ఉండడంతో ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల పాటు నిలిచిపోయింది. ఇక రీసెంట్ గానే తమిళ నాడు లో ఎలక్షన్స్ కంప్లీట్ కావడంతో మళ్ళీ కమల్ ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించాడు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ లో కమల్ తో పాటు అనేక మంది హీరోలు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను విడుదల చేశారు. తాజాగా మేకర్స్ తమ టీం లోకి కొత్త థగ్ రాబోతున్నాడు అంటూ ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్ చేశారు. రేపు ఉదయం 10 గంటలకి దీనిని రివీల్ చేస్తున్నట్టుగా తెలిపారు. మరి మేకర్స్ విడుదల చేయబోయే ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమిటో తెలియాలి అంటే రేపు ఉదయం 10 గంటల వరకు వేసి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: