నందమూరి కళ్యాణ్ రామ్ కొంత కాలం క్రితం డెవిల్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అభిషేక్ నామ దర్శకత్వం వహించాడు. అలాగే ఈయన ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. కొంత కాలం క్రితం కళ్యాణ్ రామ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా రూపొందిన బింబిసారా మూవీ అద్భుతమైన విజయం అందుకుంది.

అలాగే ఈ సినిమాలో వీరి జంటకు కూడా మంచి గుర్తింపు లభించింది. అలా ఈ మూవీ ద్వారా సక్సెస్ ఫుల్ జోడిగా పేరు తెచ్చుకున్న ఈ జంట రెండవ సారి డెవిల్ మూవీ లో కనిపించనుండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మొదటి నుండి మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ పోయిన సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించలేదు. కాకపోతే ఈ జంటకు మాత్రం ఈ సినిమా ద్వారా కూడా మంచి గుర్తింపు లభించింది. ఇక డెవిల్ మూవీ లో మొదట సంయుక్త మీనన్ ను కాకుండా మరో బ్యూటీ ని హీరోయిన్ గా అనుకున్నారట. ఆమె ఆ సినిమాలో నటించను అని చెప్పడంతో మేకర్స్ సంయుక్తా మీనన్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారట.

మరి డెవిల్ మూవీ ని రిజెక్ట్ చేసిన ఆ బ్యూటీ ఎవరో తెలుసా ..? ఆమె మరెవరో కాదు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న మృనాల్ ఠాకూర్. మొదట డెవిల్ మేకర్స్ ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కి జోడిగా మృనాల్ ఠాకూర్ ను అనుకొని ఆమెకు కథను కూడా వివరించారట. కథ మొత్తం విని స్టోరీ బాగానే ఉన్నప్పటికీ ఆ సమయంలో ఇతర మూవీ లు ఉండడంతో ఈ సినిమా చేయలేను అని చెప్పిందంట. దానితో మేకర్స్ ఆ స్థానంలో సంయుక్త మీనన్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

kr