తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో నిఖిల్ ఒకరు. ఈయన హ్యాపీ డేస్ అనే మూవీ తో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈయనకు వరుసగా సినిమా అవకాశాలు దక్కాయి. కానీ హ్యాపీ డేస్ సినిమా తర్వాత ఈయన నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజాయలను ఎదుర్కొన్నాయి. దానితో ఈయన క్రేజ్ కూడా చాలా వరకు పడిపోయింది.

అలాంటి సమయం లోనే ఈయన స్వామి రారా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఒక్క సారిగా ఈయన మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత వరుసగా ఈయన నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను సాధిస్తూ వెళ్లడంతో ప్రస్తుతం నిఖిల్ తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితమే నిఖిల్ "కార్తికేయ 2" సినిమాలో హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.

మూవీ తర్వాత నిఖిల్ "స్పై" అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరచింది. ప్రస్తుతం ఈయన స్వయంభు అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. ఇకపోతే ఈ మూవీ లోని ఓకే ఒక్క యాక్షన్ సీన్ కోసం మేకర్స్ 8 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ ను 12 రోజులు చిత్రీకరించినట్లు సమాచారం. తాజాగా ఈ మూవీ యూనిట్ 8 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్మూవీ కే హైలైట్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: