కోలివుడ్ యాక్ష‌న్ హీరో విశాల్ ఇటీవ‌ల చ‌క్ర సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ చిత్రం ఆశించిన మేర‌కు అంద‌రినీ ఆక‌ట్టుకోలేక‌పోయింది. ప్ర‌స్తుతం ఎనిమి, వీర‌మే వాగై సూడు, తుప్ప‌రివాల‌న్‌2 వంటి యాక్ష‌న్ చిత్రాల‌లో న‌టిస్తున్నాడు విశాల్‌. తాజాగా ఓ పాన్ ఇండియా మూవీని ప్ర‌క‌టించాడు. దీనికి ల‌త్తి అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. తెలుగు, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో లాఠీగా.. మ‌ళ‌యాళంలో లత్తి గా విడుద‌ల కానుంది.

ద‌ర్శ‌కుడు ఏ.వినోద్‌కుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి సంగీతం సామ్ సీ ఎస్. ఇటీవ‌ల ఈ చిత్రానికి టైటిల్‌ను ఖాయం చేశారు. అదేవిధంగా ఒక మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. దాబా మీద ఎండ‌పెట్టిన మిర‌ప‌కాయ‌ల‌ను చూపిస్తూ అక్క‌డ ఆరేసిన ఓ చెక్స్ ష‌ర్ట్ ఖాఖీ ష‌ర్ట్‌గా మారి.. ఎస్‌.మురుగానందం అనే పేరు రివీలు అవ్వ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న‌ది. ఈ పోస్ట‌ర్‌ను చూస్తుంటే విశాల్ మురుగానందం అనే పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌నున్న‌ట్టు అర్థం అవుతోంది. అయోగ్య సినిమా తరువాత విశాల్ పోలీసుగా న‌టిస్తున్న మూవీ ఇదే. దీంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. త్వ‌ర‌లో సినిమాకు సంబంధించి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సునైన హీరోయిన్‌గా న‌టిస్తొన్న ఈ పాన్ఇండియా మూవీ విశాల్‌కు హిట్ ఇస్తుందో లేదో వేచి చూడాలి మ‌రి.మరింత సమాచారం తెలుసుకోండి: