హుజూరాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ప్రారంభం నుంచి దూసుకెచ్చిన విధంగానే 15వ రౌండ్‌లో కూడ ఈట‌ల మెజార్టీ క‌న‌బ‌రిచారు. హుజూరాబాద్‌లో ముఖ్యంగా టీఆర్ఎస్‌, బీజేపీ మ‌ధ్య‌నే ర‌స‌వ‌త్త‌మైన పోరు కొన‌సాగిన‌ది. కాంగ్రెస్ చిత్తు గా ఓడింది. ఆశించిన మేర కూడ ఫ‌లితాలు ద‌క్క‌లేదు కాంగ్రెస్‌కు. ఇప్ప‌టికే 15వ రౌండ్‌లో 2149 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ దూసుకెళ్తుంది. మొత్తంగా బీజేపీ11,583 ఓట్ల ఆధిక్యంలో కొన‌సాగుతున్న‌ది. బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల 68,142, టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీ‌నివాస్ 56,985 ఓట్ల‌ను సాధించారు.

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న‌టువంటి హుజూరాబాద్‌, వీణ‌వంక‌, జ‌మ్మికుంట మండలాల‌లో ఇప్ప‌టివ‌ర‌కు కౌంటింగ్ పూర్త‌యిన‌ది. ఇల్లంద‌కుంట‌, క‌మ‌లాపూర్ మండ‌లాలు కౌంటింగ్ కొన‌సాగించాల్సి ఉన్న‌ది. 16, 17రౌండ్‌ల‌లో ఇల్లంద‌కుంట‌, 18 నుంచి క‌మ‌లాపూర్ మండ‌లంలో కౌంటింగ్ కొన‌సాగించ‌నున్నారు. క‌మ‌లాపూర్‌లో బీజేపీ ముందంజ‌లో ఉంటుందా లేక టీఆర్ఎస్ ముందంజ‌లో ఉంటుందా అని ఆస‌క్తిక‌రంగా జ‌నాలు ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: