తెలంగాణ‌లో డిసెంబ‌ర్ 10 నిర్వ‌హించే స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ కు అవ‌స‌ర‌మైన అన్నీ ఏర్పాట్ల‌ను చేయాలి అని రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి శశాంక్ గోయ‌ల్ ఆదేశించారు. ఎన్నిక‌లు జ‌రిగే జిల్లాల కలెక్ట‌ర్లు, పోలీస్ క‌మిష‌న‌ర్లు, ఎస్పీలు, అధికారులతో ఇవాల సీఈఓ బుద్ధ‌భ‌వ‌న్ నుంచి ఆన్‌లైన్‌లో స‌మీక్ష నిర్వ‌హించారు.  పోలింగ్ కు అవ‌స‌ర‌మైన అన్నీ  భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను స‌మీక్షించారు శశాంక్ గోయల్‌.

ఎక్క‌డా కూడా ఎలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల‌ని ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి సూచించారు.     పోలింగ్ స‌మ‌యంలో కొవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని, పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలకు అనుమ‌తి లేదు అని స్ప‌ష్టం చేసారు గోయ‌ల్‌. ముఖ్యంగా ఐదు ఉమ్మ‌డి జిల్లాల‌కు సంబంధించి ఆరు స్థానాల‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌ల కోసం 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన‌ట్టు  సీఈఓ వెల్ల‌డించారు. 5,326 మంది ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు అని.. అన్నీ పోలింగ్ కేంద్రాల‌లో వెబ్ కాస్టింగ్ లేదా వీడియోగ్ర‌ఫీ ఉంటుంద‌ని శ‌శాంక్ గోయ‌ల్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: