ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఇది నిజంగానే శుభవార్త.. దేశంలోని చాలా ప్రాంతాల్లో... వడగాలుల పరిస్థితులు తగ్గుముఖం పడుతున్నాయట. ఈ విషయాన్ని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రేపటి వరకు వాయవ్య భారతంలో ఉరుములతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తూర్పు, దక్షిణ భారత్ లో ఆరో తేదీ వరకు ఇలాగే ఉంటుందట.  ఈశాన్య ప్రాంతంలోనూ ఒకటి రెండు రోజులు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఇటీవల ఎండలతో అల్లాడిన దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ , రాజస్థాన్ , పంజాబ్ తదితర ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల్లో తేలిక వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. వచ్చే ఐదు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందట.


మరింత సమాచారం తెలుసుకోండి: