ఇండియా లో ఇస్లాం సంప్రదాయం ప్రకారం.. షరియా రూల్స్ అమలు కావడం లేదు. కేవలం కొన్నింటిని మాత్రమే పాటిస్తున్నారు. షరియా రూల్స్ అఫ్గానిస్తాన్, సౌదీ అరేబియా లాంటి దేశాల్లోనే అమలవుతున్నాయి. షరియా రూల్స్ ప్రకారం.. దొంగతనం చేస్తే చేతులు నరికి వేయాలి. ఇలానే అమ్మాయిల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన శిక్షలు ఉంటాయి. ఇండియాలో ఉన్న ముస్లింలు వీటిని పాటించడం లేదు.

యూనిఫాం సివిల్ కోడ్ అంశం దేశ పౌరులకు అత్యంత అవసరమైందని అది హిందు, ముస్లిం, క్రిస్టియన్లకు అనే తేడా లేకుండా ఒకే దేశం ఒకే చట్టం అనే నినాదంతో దీన్ని తీసుకొస్తున్నారు. దీని వెనక ముస్లింలకు అన్యాయం జరిగిపోతుందని ఎంఐఎం నేత అసదొద్దీన్ ఓవైసీ లాంటి నేతలు వివిధ రాజకీయ పక్షాలను కలిసి యూసీసీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుతున్నారు. మరి కేంద్రం తీసుకురావాలనుకుంటున్న యూసీసీ పార్లమెంటులో బిల్లు పాస్ అవుతుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

UCC