ప్రతిభావంతులైన పేదల విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నట్లు హైదరాబాద్ జకాత్‌ అండ్‌ చారిటిబుల్‌ ట్రస్ట్‌ ప్రకటించింది. రెండేళ్ల ఇంటర్‌తో పాటు ఐటీ, నీట్‌, ఎంసెట్‌, సీఏ శిక్షణ అందిస్తోంది. వికారాబాద్‌లో హైదరాబాద్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సిలెన్సీ కళాశాలలో ప్రవేశాల కోసం  హైసెట్‌-24 స్కాలర్‌షిప్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈనెల 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 15 తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. అర్హత ఉండి ప్రతిభవంతులైన విద్యార్థులు http://bleset in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.


ఎంపికైన విద్యార్థులకు రెండేళ్లు పూర్తిగా ఉచితంగా విద్యను అందిస్తారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, వ్యక్తిత్వ వికాసం, స్పార్ట్‌లు స్కే స్విమ్మింగ్, క్రికెట్, ఫుట్‌బాల్, ఫెన్స్ షటిల్, ఇండోర్ స్పోర్ట్స్ వంటి సౌకర్యాలు కల్పిస్తారు. హైదరాబాద్‌ బేగంపేటలోని  ట్రస్ట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైదరాబాద్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సిలెన్సీ హైసెట్‌-24 పరీక్షలకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: