భారత్ లో అమెజాన్ ఒకప్పటి ఈస్ట్ ఇండియా సంస్థ మాదిరి పెత్తనం చేస్తూ విదేశీ వస్తువులను చాపకింద నీరులా అమ్మేసుకుంటుందని ఆర్.ఎస్.ఎస్. తన ప్రచురణ సంస్థ ద్వారా విమర్శించింది. అమెజాన్ భారత్ లో ఉన్న చిన్న చిన్న వ్యాపారులకు లాభం చేకూరుస్తాం అంటూ లేదు కలిసి వ్యాపారం చేద్దాం అంటూ ఆకర్షించి వారి ద్వారా ఆయా దేశాల ఉత్పత్తులను అమ్ముకుంటుందని వారు విమర్శించారు. ముందు ఒప్పందం కుదిరే వరకు ఒకమాట కుదిరిన తరువాత మరో మాట చెప్తూ ఆయా చిరువ్యాపారులపై అమెజాన్ పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తుందని వారు అన్నారు. భారత్ లో చిరు వ్యాపారులే ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారి ద్వారా విదేశీ వస్తువులు అమ్ముకోడానికి ప్రణాళిక మాత్రమే ఈ ఒప్పందాలు అని వారు అన్నారు.

ఈ విధానాల తో అమెజాన్ భారత మార్కెట్ పై గుప్తదిపత్యం చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు వారు తెలిపారు. అందుకే ఇక్కడ ఉన్న లోపాలను బాగా తెలుసుకొని ఆయా రాజకీయ, ఆర్థిక, వ్యక్తిగత స్వేచ్ఛలను హరించేందుకు ప్రయత్నిస్తున్నాడని వారు అన్నారు. తద్వారా భారత ఈ మార్కెట్ ఫ్లాట్ ఫారమ్ ను హస్తగతం చేసుకోవాలనే ఆలోచనలో అమెజాన్ ఉన్నట్టు వారు తెలిపారు. అందుకే ఇక్కడ ఆయా వర్గాలకు  కోట్లలో ముడుపులు ఇచ్చి తనకు అడ్డు ఉన్న విషయాలను నిశబ్దంగా తొలగించుకుంటుంది అని అన్నారు. తన ప్రైమ్  మాధ్యమం లో కూడా భారతీయ వ్యతిరేక  వీడియో లను ప్రసారం చేయడం ఇటీవల అనేక వివాదాలు తెరతీసింది అని వారు తెలిపారు.

అమెజాన్ చిరు వ్యాపారులకు సాయం పేరుతో మోడీ వద్దన్న విదేశీ సంస్థల ఉత్పత్తులను మరో మార్గంలో దేశంలో అమ్ముకుంటుందని ఆర్.ఎస్.ఎస్. విమర్శించింది. ఉదాహరణకు క్లౌడ్ టైల్, అపిరియా వంటి సంస్థలను తానే సృష్టించిందని వారు తెలిపారు. అమెరికాలో ఆయా సంస్థల ను తన ఆదీనంలో ఉంచుకుందని తెలిపారు. అలనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ మాదిరి ముందు దేశంలో ప్రవేశించి అనంతరం మత మార్పిడిలను ప్రోత్సహించడం ద్వారా తన లక్ష్యాలను సాదిస్తుందని వారు విమర్శలు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: