భారతదేశం కరోనా సంక్షోభాన్ని మొదటి నుండి ఎదుర్కొంటు వస్తుంది. అసలు ఇంతపెద్ద దేశం, ఇంత జనాభా ఉన్న దేశం ఈ స్థితి నుండి ఇంత త్వరగా బయటపడుతుంది అనేది ఎవరూ ఊహించలేదు. కానీ మొదటి వేవ్ నుండి భారత్ కాస్త మెరుగ్గానే కరోనా నుండి బయటపడుతూ వచ్చింది. దానిని చుసిన ప్రపంచదేశాలు భారత్ ను చూసి నోళ్లు వెళ్ళబెట్టుకున్నారు. కారణం ఇక్కడ ఉన్న జనాభా ఐక్యంగా అదికూడా ఈ సంక్షోభంలో ఉండగలరని ఎవరూ ఊహించలేదు. కానీ దానికి దేశప్రజలు సంసిద్ధం చేసిన ప్రధాని మోడీ పనితీరు ఇక్కడ బాగా పనిచేసింది. ఏదో వచ్చేస్తుంది, వెళ్లి దాక్కోండి అనే భయానక తీరులో కాకుండా తమ దేశం తమ మాట విని ఐక్యంగా అందరం దీనిని ఎదిరించి పోరాడటం లేదా పోరాడగలం అనే నమ్మకం ముందు ఆయనలో కలిగిన తరువాత దేశంలోని ప్రజల ముందుకు వచ్చారు.

అందుకే అప్పట్లో ఆయన ఒక్కసారిగా మూడు నెలలు అనే మాట ఎత్తకుండా మొదట చిన్న ప్రయత్నంగా ఒక్కరోజు ఉంచి, అలా మెల్లిగా అలవాటు పడనిచ్చి, అనంతరం మూడు నెలలు లాక్ డౌన్ విధించారు. అయినా ఎవరు కూడా ఈ మాటలు పట్టించుకుని భారతీయులు సహకరిస్తారు అనే నమ్మకం ప్రపంచానికైతే లేదు, కానీ దానిని సాధించి చూపించారు భారతీయులు. ఈ తరహా స్పందన భారతీయులు కూడా అసలు ఊహించారు. అంతగా మూడు నెలలు విజయవంతంగా గడిచింది. అయితే అందులో కూడా ఒకేఒక చిన్న బాధాకరమైన విషయం వలస కూలీలకు సరైన ఏర్పాట్లు చేసి ఈ పని చేయాల్సింది అనేది. ఆ ఒక్కటి అప్పట్లో జరిగి ఉంటె, అంతా బాగున్నట్టే.

ఇలా మొదటి మెట్టు బాగా విజయవంతం కావడంతో, ప్రపంచం విస్తుపోయి దేశంవైపు చూసింది. అక్కడే మరో తడబాటు, వెంటనే అందరు సాధారణ స్థితికి వచ్చేశారు, రెండో వేవ్  విజృంభించింది. భారత్ ఈ సరైన అయిపోతుంది అనుకున్నారు చాలామంది. కానీ కాస్త పాఠాలు నేర్చుకొని బయటపడింది. అయినా ఈ పరిస్థితులలో కూడా ఆర్థికవృద్ధి రేటు 8.3 శాతం ఉంటుంది అని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అయితే కరోనా రెండో వేవ్ తట్టుకొని నిలబడిన భారత్ కు ఈ వృద్ధిరేటు తక్కువ ఏమి కాదని ప్రపంచ బ్యాంకు ఆర్థిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: