సాధారణంగా మనం సినిమాల్లో చూసిన కొన్ని సన్నివేశాలు అటు నిజ జీవితంలో కూడా నిజం అవుతూ ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే బిచ్చగాళ్ళ విషయంలో ఇలాంటివి చాలాసార్లు నిజమయ్యాయి. సినిమాల్లో ఒక్క రూపాయి దానం చేసి ఏకంగా 100 రూపాయలు ఇచ్చినట్లుగా కొంతమంది ఫీల్ అవ్వడం.. ఇక వారికి బిచ్చగాళ్లే జేబులోంచి వంద రూపాయలు తీసి పండుగ చేసుకో అంటూ చెప్పడం లాంటి సన్నివేశాలు చాలా సినిమాల్లోనే చూసాం. ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు ప్రేక్షకులు అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అయితే నిజ జీవితంలో కూడా భిక్షాటన  వారిలో ధనవంతులు చాలామంది ఉంటారు అన్నగారికి నిరూపణగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి.



 అయితే ఇక ఇప్పుడు ఏకంగా రిచెస్ట్ బిచ్చగాడికి సంబంధించిన వార్త వైరల్ గా మారిపోయింది. రిచ్ అంటున్నారూ.. బిచ్చగాడు అంటున్నారు. ఏమీ అర్థం కాక కన్ఫ్యూజన్లో పడిపోయారు కదా.. ఏకంగా బిచ్చం ఎత్తుకుంటూ జీవిస్తున్న వారిలో కోటీశ్వరుడు కూడా ఉంటారు అన్న ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తే అర్థమవుతుంది. మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి భిక్షాటన చేస్తూ కోట్లు కూడా పెట్టాడు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడిగా వార్తల్లోకేక్కాడు. ముంబై కి చెందిన భారత్ జైన్ అనే వ్యక్తి బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబంలో ఆర్థిక సమస్యల నేపథ్యంలో చదువును మధ్యలోనే ఆపేసి భిక్షాటన మొదలుపెట్టాడు.



 ఇలా ముంబై వీధుల్లో తరచూ బిచ్చం ఎత్తుకుంటూ రూపాయి రూపాయి పోగేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు వేళల్లో సంపాదిస్తూ ఇక చివరికి కోట్లల్లో ఆస్తులు కూడ పెట్టాడు. తన పిల్లల్ని కార్పొరేట్ పాఠశాలలో చదివిస్తున్నాడు. ఇక ఒక డూప్లెక్స్ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. దీనికి తోడు రియల్ ఎస్టేట్లో కూడా పెట్టుబడులు పెట్టాడు. దీంతో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని అర్ధిస్తూ  ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన బిచ్చగాడిగా గుర్తింపు పొందాడు.  ప్రస్తుతం అతని ఆస్తి విలువ ఏకంగా 7.5 కోట్ల వరకు ఉంటుందట. ఇక ముంబైలో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఉంది. దాని విలువ 1.2 కోట్ల వరకు ఉంటుందట. అంతేకాదు రెండు షాపులు కూడా రెంటుకి ఇచ్చాడు. వీటి ద్వారా నెలకు 40,000 వరకు  వస్తుందట.  బిక్షాటనతో  రోజుకు ₹2000 సంపాదిస్తున్నాడు.  భిక్షాటన చేస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగి కంటే లగ్జరీ లైఫ్ గడిపేస్తున్నాడు అని చెప్పాలి. అయితే తనను ఇంతటి వాడిని చేసిన భిక్షాటను వృత్తిని మాత్రం వదిలేయను అంటూ చెబుతున్నాడు ఈ సంపన్నుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: