ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. నోరు తీపి చేసుకోడానికి మిఠాయి తింటాం. అలాంటి మిఠాయిలు జాబితాలో చూసినట్లయితే అత్యంత ఇష్టమైన డిషెస్ లో ఒకటి రవ్వ కేసరి ఒకటి.ఇది ఎంతో రుచికరమైన మిఠాయి వంటకం. దీన్ని ఇష్టపడే వారంటూ ఎవరూ వుండరు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా అందరు ఇష్టంగా తినే వంటకం. ఇది త్వరగా తయారయే రెసిపీ దీనిని మంచి సంతోషకరమైన సందర్భాలలో, విందులలో తయారు చేసుకుంటారు.ఈ రుచికరమైన రెసిపిని చేసుకోవటానికి ఏ కారణాలు అవసరం లేదు. మీకు తినాలని కోరిక కలిగినపుడు ఎప్పుడుకావాలంటే అపుడు దీనిని వండుకొని తినొచ్చు. రవ్వ కేసరి ని తరచుగా దేవతలకు నైవేద్యముగా పెడతారు. ఇంకెందుకు ఆలస్యం ? రండి ..ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూదాం.

ముందుగా రవ్వ కేసరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్ధాలు...

ప్రధాన పదార్థం.....

1 కప్ సెమోలినా....

1 కప్ చక్కర...

ప్రధాన వంటకానికి....

1/2 కప్ నెయ్యి....

1/2 కప్ పాలు....

అవసరాన్ని బట్టి ఎండు ద్రాక్ష....

2 1/2 కప్ నీళ్ళు....

అలంకారానికి....

అవసరాన్ని బట్టి కొంచెం నలిపినవి జీడిపప్పు...

అవసరాన్ని బట్టి పొడిగా చేసిన యాలకులు....

రవ్వ కేసరి తయారు చేసే విధానం చూడండి....

కడాయిని తీసుకోని అందులో రవ్వని వేసుకోవాలి మంటని మీడియంలో పెట్టి 2 నుంచి 3 నిముషాల వరుకు వేయించండి. లేదా రంగు మారేంత వరుకు వేయించుకోండి. ఇప్పుడు పాలను పోసుకొని బాగా కలుపుకోండి.

ఈ మిశ్రమం ఉడికి దగ్గరపడ్డాక కావలసినంత పాలు, పంచదారను వేసుకొని బాగా కలుపుకోవాలి.మిశ్రమం గడలు కట్టకుండా చూసుకోవాలి.

చివరిగా ఎండు ద్రాక్షలు, జీడిపప్పులు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏలకుల పొడిని వేసి కలుపుకొని వడ్డించుకోండి.

ఇక ఈ రుచికరమైన రవ్వ కేసరిని హాయిగా తింటూ ఆస్వాదించండి. ఇలాంటి కుకింగ్ ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. మరిన్ని రుచికరమైన వంటకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: