ఇటీవలి కాలంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. అడుగడుగునా మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు.  ఇంటి నుంచి కాలు బయట పెడితే చాలు ఎంతో మంది ఆకతాయిలు ఇక ఆడపిల్లలను ఏదో ఒక విధంగా వేధింపులకు గురు చేస్తున్నారు. అంతే కాదు ఎంతో మంది ప్రేమ పేరుతో అమ్మాయిలను వేదిస్తున్నారు.అడుగడుగున భయ బ్రాంతులకు గురి చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మరి కొంతమంది ఇక సోషల్ మీడియా వేదికగా అమ్మాయిలకు మెసేజ్ చేయడం లేదా అసభ్యకరమైన వీడియోలు పంపించడం లాంటివి చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు.



  ఈ క్రమంలోనే మహిళలు వేధింపుల నుంచి బయటపడటానికి అంతే కాదు మహిళలకు ప్రత్యేక రక్షణ కల్పించడానికి తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్ ప్రారంభించారు పోలీసులు. షీ టీమ్స్ ద్వారా ప్రత్యేకంగా మహిళలకు రక్షణ కల్పించాలని భావించారూ. ఈ క్రమంలోనే ఎంతోమంది మహిళలు ఇటీవలి కాలంలో తనకు ఎదురవుతున్న వేధింపులను షీ టీమ్స్ దృష్టికి తీసుకెళ్లిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తు న్నాయి. ఆడపిల్ల నుంచి ఏదైనా ఫిర్యాదు అందుకున్నారు అంటే కేవలం నిమిషాల వ్యవధిలోనే ఈ సమస్యను పరిష్కరించేందుకు షీ టీం లోని పోలీసులు ప్రస్తుతం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. ఇటీవలే ఒక ఆకతాయి ఆగడాలకు అడ్డుకట్ట వేశారు పోలీస్.



  ప్రేమించడం ఇష్టం లేదు అని తెలిపీనప్పటికీ ఒక యువకుడు మాత్రం యువతిని వాట్సాప్ లో వేధించడం మొదలు పెట్టాడు. వాట్సాప్లో యువతిని వేధిస్తున్న ఆకతాయినీ ఇటీవలే షీ టీమ్ పోలీసులు అరెస్టు చేశారు  గత కొంతకాలంగా పరుపు ప్రేమ పేరుతో వేధింపులకు గిరి చేస్తూ ఉండేవాడు. ఇష్టం లేదు అని చెప్పినచ్చినప్పటికీ అసభ్యకరంగా వాట్సాప్ మెసేజ్ చేయడం చేసేవాడు. షీ టీమ్ ఫిర్యాదు చేస్తాను అని యువత హెచ్చరించినప్పటికీ ఇక నేను ఎవరో తెలియదు కదా ఎలా పట్టుకుంటారు అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు. ఇక ఆ యువతి షీ టీమ్ కి ఫిర్యాదు చేయగా ఇటీవలే రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: