ఆస్పత్రి అంటేనే దేవాలయం లాంటిది. అలాంటి ఆస్పత్రికి ఎంతోమంది రోగులు వచ్చి తమ ప్రాణాలను కాపాడుకుంటున్నారు. అక్కడ ఉండే వైద్యులను దేవుడి కంటే గొప్పగా చూస్తారు. అంతటి ఘనత కలిగినటువంటి  ఆస్పత్రుల్లో కొంతమంది నర మానవులతో తలంపులు వస్తున్నాయి. నమ్మి వెళ్లిన వారిపై  అఘాయిత్యాలకు పాల్పడుతు, వైద్య వృత్తికి భంగం కలిగించే పనులు చేస్తున్నారు. అదేదో ప్రైవేటు ఆస్పత్రిలో జరిగిందంటే ఏమో అనుకోవచ్చు, అందరికీ అండగా ఉన్నా ప్రభుత్వ ఆసుపత్రి పట్టణం నడిబొడ్డున ఉన్న  గాంధీ ఆసుపత్రిలో యదార్థ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు పై ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు. వారికి మత్తు మందు ఇచ్చి గదిలో బంధించారు. అలా నాలుగు రోజుల పాటు వారిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. అక్కడి నుంచి తప్పించుకున్న ఒక బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 దీంతో ఈ విషయము మొత్తం వెలుగులోకి వచ్చింది. తాను వారినుంచి తప్పించుకున్ననని, కానీ తమ సోదరి ఎక్కడుందో  తెలియడం లేదని బాధితురాలు తెలిపింది. వివరాల్లోకి వెళితే మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందినటువంటి ఒక వ్యక్తి  తీవ్రమైన కిడ్నీ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు  చికిత్స కొరకు గాంధీ దవాఖాన కి తీసుకు వచ్చారు. ఈ నెల 4న అతన్ని దవాఖానాల్లో అడ్మిట్ కూడా చేసుకున్నారు. అతనికి తోడుగా ఆయన భార్య, ఆమె యొక్క  చెల్లెలు గాంధీ దవాఖాన కి వచ్చారు. ఈ సమయంలోనే ఆ పేషెంట్ ను మరో రూంలోకి మార్చడం తో అతని భార్య మరియు ఆమె చెల్లెలు అతన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక తడబడ్డారు. ఈ సందర్భంలో అక్కడే ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్ ఉమామహేశ్వర్.. వారిని నమ్మించి వార్డు చూపిస్తాం అని తెలిపాడు. ఇలా వారిని ఒక గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడే  బాధితురాలికి మత్తు మందు కూడా ఇచ్చారని బాధితురాలు తెలిపింది. ఇక వారిపై  నలుగురు వ్యక్తులు  అత్యాచారం చేసినట్టు ఆమె తెలిపింది. ఇలా వారు నాలుగు రోజులపాటు వారిని బంధించారని, అయితే వారి నుంచి తప్పించుకొని వచ్చానని, కానీ అక్క ఎక్కడుందో తెలియడం లేదంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసినది. ఈ యొక్క ఘటనపై ఆ మహిళ మహబూబ్నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినది.

వారు  గాంధీ దవాఖాన దగ్గరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని చెప్పారు. ఆ మహిళ తిరిగి హైదరాబాద్ వెళ్లి చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాంధీ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ అయినా ఉమామహేశ్వర్ తనపై అత్యాచారం చేసినట్టు ఫిర్యాదులో రాసి ఇచ్చింది. దీంతో వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఉమా మహేశ్వరితో పాటు ఇంకో ఇద్దరు గార్డులు అత్యాచారం చేసినట్టు నిర్ధారించుకున్నారు. వెంటనే ల్యాబ్ టెక్నీషియన్ అయినా ఉమామహేశ్వర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: