విజయవాడలో దారుణ హత్యకు గురైన యువ పారిశ్రామిక వేత్త రాహుల్ హత్య కేసులో పోలీసు ట్విస్ట్ ఇచ్చారు.ఐపీసీ క్రింద కేసు సెక్షన్ 302,120B రెడ్ విత్ 34 నమోదు చేసిన మాచవరం పోలీసులు కేసులో కోరాడ విజయ్ తో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త కొగంటి సత్యంను చేర్చారు.వీరితో పాటు ముగ్గురు మహిళలు  కూడా హత్యలో భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.రాహుల్ హత్య తరువాత తండ్రి కరణం రాఘవరావు ఇచ్చిన   ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.A1 కొరడ విజయ్ కుమార్,A2 కోగంటి సత్యం,A3  పద్మజ,A4 పద్మజ, A5 గాయత్రీగా ఎఫ్.ఐ.ఆర్ లో నమోదు చేశారు.

ఇదిలా ఉంటె ఎఫ్ఐఆర్లో కీలక అంశాలను ప్రస్తావించారు పోలీసులు.రాహుల్ తండ్రి రాఘవరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  లోతుగా దర్యాప్తు చేస్తున్నారు బెజవాడ పోలీసులు అస్సలు వివాదంపై సీరియస్ గా ఫోకస్ పెట్టడంతో  దిమ్మదిరిగే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.కొరడా విజయ్ తో పాటు,రాహుల్ పాట్నర్స్ గా ఉన్న
జిక్సిన్ సిలిండర్స్ కంపెనీని అమ్మాలని రాహుల్ పై వత్తిడి తెచ్చిన కొరాడ విజయ్  కంపెనీని కోగంటి సత్యంకు కి అమ్మాలని రాహుల్ కు ప్రొపోజల్   పెట్టారు.అస్సలు వివాదం ఇద్దరు మధ్య ఉండటం అతి తక్కు రేటుకు కంపెనీ కావాలన్న కోగంటి సత్యం అడగటంతో  తక్కువ రేటుకు రాహుల్ అంగీకరించలేదు రాహుల్ దీనితో రాహుల్ కి కాల్ చేసి బయటకు పిలిచి హత్య చేశారు.

ఇదిలా ఉంటె హత్య కేసులో తనకు ఏమి సంబంధం లేదని మొదటి నుంచి చెప్పిన కోగంటి సత్యం మొత్తం కథ వెనుక ఆయనే సూత్రధారి కావడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అయితే a2 నిండుతుడిగా కోగంటి సత్యాన్ని కేసులో పెట్టడం వెనుక మొత్తం ఆయనే స్కెచ్ వేసి చేసారని అంటున్నారు పోలీసులు. పైగా హత్య జరగడానికి ముందు కూడా సత్యం వీరితో గొడవ పడ్డారని చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ నేత కూడా రాహుల్ హత్య కేసులో సీరియస్ గా విచారణ చెయ్యాలని పోలీసులపై ఒత్తిడి చేయడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: