ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.కానీ చివరికి ప్రియురాలు ఒకటి అనుకుంటే అక్కడ జరిగింది ఇంకొకటి. జిల్లాలోని నవాబుపేట మండలం చౌటపల్లి కి చెందిన గౌడ్ అనే యువకుడు హైదరాబాద్ కి చెందిన యువతితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఆమెతో అన్నిరకాల అవసరాలు తీర్చుకున్నాడు. ప్రస్తుతం ఆర్మీ ఉద్యోగం చేస్తున్నాడు ఆ యువకుడు.
అయితే ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదంటూ మొహం చాటేస్తూ తిరిగాడు. ఇటీవల నవాబ్ పేట పోలీస్. స్టేషన్కు వచ్చి తనను ప్రియుడు మోసం చేశాడని ఫిర్యాదు చేసింది ఆ యువతి. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసును పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు ఫార్వర్డ్ చేశారు. ఇక ఓ రోజు గ్రామానికి వచ్చి తాళం వేసి ఉన్న ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేసింది.. ఆ తర్వాత బెంగాల్ లో పనిచేస్తున్న తిలక్ గౌడ్ దగ్గరికి వెళ్లి ప్రశ్నించగా పెళ్లి చేసుకునేందుకు అతను నిరాకరించాడు.. దీంతో మళ్లీ ప్రియుడి ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేశాడు. అయితే ఇటీవలే మరోసారి తన ఇద్దరు స్నేహితులతో వచ్చి ప్రియుడి ఇంటి ధర్నా చేయడమే కాదు బెదిరింపులకు కూడా పాల్పడింది. తన దగ్గరికి ఎవరైనా వస్తే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో భయపడిపోయిన ఇద్దరు స్నేహితురాళ్లు అక్కడి నుంచి పారిపోయారు.. స్థానికులు ఆ యువతి ని పట్టుకుని చితకబాదారు. పోలీసులు వచ్చే లోపే యువతికి చాలా గాయాలయ్యాయి. అయితే ప్రియుడు మోసం చేశాడని న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంది ఆ యువతీ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి