చట్టప్రకారం యువతీ యువకులు సహజీవనం చేసుకోవచ్చు అంటూ ఇప్పటికే కోర్టులు చెబుతున్నాయి. దీంతో ఎంతో మంది యువతీ యువకులు పెళ్లి చేసుకోవడానికి కాస్త వెనకాడుతున్నారు గాని సహజీవనం చేయడానికి మాత్రం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇలా ఎన్నో జంటలు నేటి రోజుల్లో సహజీవనం చేస్తూ ఉండగా సహజీవనమే చివరికి ప్రాణాలు పోవడానికి కారణం అవుతుంది కొన్నిసార్లు.. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఆ ఇద్దరూ మూడేళ్లపాటు సహజీవనం చేశారు కానీ ఆ తర్వాత ఏమైందో ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో ఒకరితో ఒకరు కలిసి ఉండటం  కుదరదు అని భావించి విడిపోవడానికి సిద్ధమయ్యారు. అయితే ప్రియురాలితో కలిసి ఉండాలని యువకుడికి ఉన్నప్పటికీ ప్రియురాలు మాత్రం దూరం పెరుగుతూ వచ్చింది.


 దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు సదరు వ్యక్తి. ప్రియురాలు విషయంలో యమకింకరుడు గా మారిపోయి మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.దీంతో మంటల్లో కాలిపోతూ విలవిలలాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది సదరు మహిళ. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ ఘటన. ప్రకాష్ నగర్ లో ఉండే వెంకటలక్ష్మి నాచారం లో ఈఎస్ఐ ఆస్పత్రులు స్వీపర్గా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే జగద్గిరిగుట్ట లో ఉండే వెంకటేష్ అనే యువకుడితో ఆమె మూడేళ్లుగా సహజీవనం చేసింది. ఇటీవలే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి తరచూ ఏదో ఒక విషయంలో గొడవ పడుతూ వచ్చారు.


 దీంతో ప్రస్తుతం వీరిద్దరూ విడిగా ఉంటూ ఉండటం గమనార్హం. అయితే ప్రియురాలితో కలవాలని వెంకటేష్ భావించినప్పటికీ ప్రియురాలు మాత్రం దూరం పెరుగుతూ వచ్చింది. దీంతో ప్రియురాలి తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు వెంకటేష్. ఈ క్రమంలోనే ఇటీవలే రాత్రి సమయంలో ప్రకాష్ నగర్ లో ఉంటున్న వెంకటలక్ష్మి నివాసానికి వచ్చి మరోసారి గొడవపడ్డాడు. తనతో పాటు తెచ్చుకున్న కిరోసిన్ పోసి నిప్పంటించాడు.దీంతో ఆర్తనాదాలు చేస్తూ వెంకటలక్ష్మి అక్కడికక్కడే సజీవ దహనం అయింది  ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. ఈ ఘటనలో అటు ప్రియుడు వెంకటేష్ కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: