ఇటీవలి కాలంలో ఎంతోమంది ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. చిన్నచిన్న కారణాలకే ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను అంటూ చెబుతున్నా ప్రియురాలి ఉసురు పోసుకుంటారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. ఏకంగా ప్రియురాలి గొంతు కోసిన యువకుడు దారుణంగా హత్యచేశాడు. అనంతరం అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం లో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో హత్యకు గురైన యువతి కళ్లారాలోని పాజవిలా చెందిన సుమీ గా గుర్తించారు పోలీసులు.


 ఇక ఆత్మహత్య చేసుకున్న యువకుడు అదే ప్రాంతంలో ఉన్ని గా  గుర్తించడం గమనార్హం. సుమీ, ఉన్ని  మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. సుమీ ఎవరో కాదు ఉన్ని దూరపు బంధువు కావడం గమనార్హం. కాగా ఇటీవలే  మరో యువకుడు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు సుమీ తల్లిదండ్రులు. ఈ క్రమంలోనే ఇదే విషయంపై సదరు యువతి తో మాట్లాడాలని పలుమార్లు ప్రయత్నించాడు యువకుడు. వీరి మధ్య ఈ విషయంలో గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఇటీవల ఏకంగా నిద్రమాత్రలు మింగింది సుమీ.  ఆసుపత్రికి తీసుకెళ్లగా కోలుకుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశాక తన ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది.


 ఈ క్రమంలోనే ఉన్నికి ఫోన్ చేసిన సుమీ తల్లిదండ్రులు తమ కూతుర్ని వదిలిపెట్టాలి అంటూ కోరారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ యువకుడు కోరాడు. అందుకు సదరు యువతి తల్లిదండ్రులు అంగీకరించడంతో ఇక ఎలాగైనా తన ప్రేయసిని తనతో ప్రేమకు ఒప్పించాలని  అనుకున్నాడు యువకుడు. ఇంట్లో నుంచి బయటకు తీసుకు వెళ్ళాడు. ఆ తర్వాత ఆ యువతి ఇంటికి రాలేదు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వేదకగా రబ్బర్  ప్లాంటులో విగతజీవిగా కనిపించింది యువతి. ఇక అక్కడే ఓ చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు యువకుడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: