టీడీపీ, జనసేన పొత్తు ఇంత వరకు తేలలేదు. కిందస్థాయి టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే అచ్చెం నాయుడు కూడా జనసేన తో పొత్తు కు సిద్ధంగా ఉన్నట్లే సానుకూలంగా మాట్లాడారు. అయితే జనసేన రోజు రోజుకు బీజేపీ కి దూరం అవుతున్నట్లు కనిపిస్తోంది.


కానీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే అయిదేళ్ల కాలానికి సీఎం పదవి ఇచ్చినా, లేకపోతే రెండున్నరేళ్లు షేర్ చేసినా ఒకే అనేందుకు జనసేన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ కాపు సామాజిక నేత హరిరామ జోగయ్య మాత్రం పవన్ కల్యాణ్ కు టీడీపీతో పొత్తు వద్దనే చెప్పినట్లు సమాచారం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన హత్య రాజకీయాలను గుర్తు చేశారు.


14 ఏళ్లలో టీడీపీ హయాంలోనే వంగవీటి రంగా హత్య, కుల ముద్ర, అవినీతి ఆరోపణలు జరిగాయని జోగయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. దీని సారాంశం.. అయితే జనసేన పార్టీ నుంచి పవన్ కాపులను కాపాడాలని మిగతా కులాలకు ఎలాగైతే రిజర్వేషన్లు ఇచ్చారో కాపులకు కూడా సమానంగా ఇవ్వాలని కోరుతున్నారు. ఎప్పుడూ రెడ్డి సామాజిక వర్గం ముందుకెళ్లడమేనా.. మిగతా వారు ముందుకెళ్లాల్సిన అవసరం లేదా అని పవన్ ఇప్పటికే ప్రశ్నించారు. అయితే హరిరామ జోగయ్యకు మాత్రం పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం అస్సలు ఇష్టం లేదు.


ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి సీనియర్ గా ఈయనకు తెలిసినంతా ఎవరికి తెలీదు. కానీ పవన్ జోగయ్య మాట వింటారా.. పవన్ లక్ష్యం జగన్ ను ఓడించడం. దీని కోసం ఎవరితోనైనా కలిసేందుకు సిద్దమని గతంలోనే ప్రకటించారు. ఇలా ప్రకటించినప్పటికీ టీడీపీతో పొత్తు పెట్టుకుని ఓట్ల చీలకుండా చూస్తేనే జగన్ ను సీఎం పదవి నుంచి దించేయడానికి వీలవుతుంది. మరి పొత్తులు కుదురుతాయా? లేక చివరకు పవన్ కల్యాణ్ ను ఒంటరి చేసి గత ఎన్నికల మాదిరి చేసే అవకాశం ఉందా. ఎన్నికల వరకు వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: