గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన.. ఇలా త్రిముఖ పోరు జరిగింది. అందులో వైసీపీ వ్యతిరేక ఓటు టీడీపీ, జనసేన పంచుకోవడం వల్ల అంతిమంగా వైసీపీకి మేలు జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఆ పొరపాటు మళ్లీ జరగకుండా చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఈసారి ఏకంగా రెండేళ్ల ముందుగానే పొత్తు ప్రకటన చేశారు. ఇలా చేయడం వల్ల ఆ పార్టీ టీడీపీతో పొత్తుకు సిద్ధంగా ఉందని తేలిపోయింది. అయితే.. జనసేన ఒక్కటే కాకుండా బీజేపీతో కలిసి టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది.
సో.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు ముఖాముఖి తలపడే అవకాశం ఉంది. అయితే.. ఇక్కడ ఓ కీలక ప్రశ్న తలెత్తుతోంది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకం అంత సులభంగా జరుగుతుందా.. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తుంది. సగం సగం సీట్లు పంచుకునే అవకాశం ఎలాగూ ఉండదు.. కచ్చితంగా జనసేనకు మహా అయితే ఓ 50 సీట్లు ఇస్తే ఇవ్వొచ్చు. మరి అంత తక్కువ సీట్లతో జనసేన ప్రభుత్వం ఏర్పాటవుతుందా?
వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమే గెలిచిందనుకుందాం.. అప్పుడు ఆటోమేటిగ్గా సీఎం చంద్రబాబే అవుతారు కదా.. మహా అయితే పవన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇవ్వొచ్చు. మరి ఆ మాత్రం దానికి పవన్.. జనసేన ప్రభుత్వం రాబోతోందని ఎలా చెబుతున్నారు.. ఇదే ఇప్పుడు జనసైనికులను తొలుస్తున్న అనుమానం. చూడాలి ఏం జరుగుతుందో..?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి