మంకీపాక్స్.. ఇప్పటి వరకూ కేరళలో కనిపించిన ఈ వైరస్‌.. ఇప్పుడు తెలంగాణలోనూ ప్రవేశించిందా అన్న అనుమనం కలుగుతోంది. కామారెడ్డి జిల్లా ఇందిరానగర్‌‌ కాలనీకి చెందిన 40 ఏండ్ల ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. అతన్ని హైదరాబాద్‌లోని ఫీవర్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ వ్యక్తి జులై 6వ తేదీన కువైట్ నుంచి వచ్చారని తెలుస్తోంది. 20వ తేదీన అతనికి జ్వరం వచ్చింది.  23వ తేదీ నాటికి రాషెస్‌ రావడంతో మరుసటి రోజు ఉదయం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు అతడు వెళ్లాడు.


అక్కడి వైద్యుడు మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించి అతడిని కామారెడ్డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. అక్కడి నుంచి 108లో అతన్ని ఫీవర్‌‌ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు. అక్కడ సాంపిల్ సేకరించి, పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. రిపోర్టులు వచ్చే వరకూ ఫీవర్‌‌ హాస్పిటల్‌లో ఐసోలేషన్‌లో ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఈ వ్యక్తితో నేరుగా కాంటాక్ట్ అయిన ఆరుగురిని గుర్తించారు. అయితే.. వాళ్లెవరికీ సింప్టమ్స్‌ లేవు. అయినప్పటికీ వారిని ఐసోలేషన్‌లో ఉంచాయి.


వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు గారు పరిస్థితిని సమీక్షించి, ఎప్పటికప్పుడు మాకు సూచనలు చేస్తున్నారని తెలంగాణ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్  డాక్టర్ శ్రీనివాసరావు గడల ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి సూచనల మేరకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని డైరెక్టర్ తెలిపారు. అయితే.. ప్రజలు మంకీపాక్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్  డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇది ప్రాణాంతక వ్యాధి కానందువల్ల ఆందోళన అవసరం లేదని డాక్టర్ శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు.


ఇక ఇప్పటి వరకూ దేశంలో నాలుగు మంకీ పాక్స్ కేసులు గుర్తించారు. వీటిలో మూడు కేరళ రాష్ట్రంలో నమోదు కాగా.. మరో కేసును ఢిల్లీలో గుర్తించారు. ఇటీవల ఏపీలోనూ ఓ శిశువుకు మంకీ పాక్స్ లక్షణాలు గుర్తించారు. అయితే.. పరీక్షల్లో అది మంకీపాక్స్ కాదని తేలింది. మంకీపాక్స్ తో ప్రాణ భయం అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: