
పాక్ ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీని వల్ల పాక్ లో తిండి గింజలు దొరకని పరిస్థితి. అయితే పాక్ కు ఇప్పటికే చైనా ఎక్కువ స్థాయిలో అప్పులు ఇచ్చింది. చైనా ఇచ్చిన అప్పులు దాని మీద కట్టే వడ్డీలతో పాక్ ఇప్పుడు కుదేలవుతోంది. అయితే ఈ వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితిలో చైనా పాక్ లో ఉన్న పోర్టులు, మైనింగ్ లు అన్నింటిని తీసేసుకుంటున్నారు. ఆ ప్రాంతానికి చైనా వారిని పిలిపించి అక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ పాకిస్థాన్ అమ్మాయిల్ని ప్రేమ పేరుతో వంచించి చైనాకు తీసుకెళ్లిపోతున్నారు.
అయినా పాకిస్థాన్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం చైనాకు బకాయి పడటమే. వారు ఇచ్చిన అప్పులను తీర్చలేక పాక్ లో అమ్మాయిలను చైనా వాళ్లు తీసుకుపోతున్న ఏమీ చేయలేక చూస్తుండి పోతున్నారు. పాక్ లో అమ్మాయిల జోలికి వస్తే తలలు తీసే చట్టాలు ఉన్నాచేతకాని పరిస్థితిలో పాకిస్థాన్ అధికారులు ఉన్నారు.
ప్రస్తుతం సరికొత్తగా చైనా ఇప్పుడు 700 మిలియన్ డాలర్ల అప్పులు పాక్ కు ఇస్తుంది. ఇప్పటికే ఇచ్చిన డబ్బులకు వడ్డీలు చెల్లించలేని పరిస్థితి ఉండగా ఇంకా పూర్తిగా ఆర్థిక సంక్షోభంలోకి వెళుతున్న సమయంలో మరింత ఆర్థిక సాయం చైనా నుంచి పొందనుంది. ఇంకా ఏమైనా పాక్ లో మిగిలిపోయిన మైనింగ్ లు ఉంటే వాటన్నింటిని కబ్జా చేసి మొత్తం సరకును చైనా దోచేయనుంది.