టీడీపీ అధినేత జైలుకు వెళ్లి దాదాపు నెల రోజులు దాటింది. ప్రారంభంలో  రెండు, మూడు రోజులకే ఆయన బయటకు వస్తారని అంతా భావించారు. టీడీపీ శ్రేణులైతే మహా అయితే ఓ వారం  ఆ తర్వాత తమ నేత కడిగిన ముత్యంలా బయటకి వస్తారని అనుకున్నారు. కానీ కోర్టు మాత్రం వాయిదాలు వేస్తూ వస్తోంది. ఏసీబీ నుంచి హైకోర్టు, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇలా ప్రతి కోర్టులో చంద్రబాబుకి సంబంధించిన కేసులు విచారణ జరుగుతూనే ఉన్నాయి.


రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబు అరెస్టు చేశారన్న ఆరోపణలు ఉన్నా.. కేంద్రం సహకారం లేకుండా మూకుమ్ముడిగా ఇన్ని కేసులు పెట్టి జైలులో ఉంచుతారా అన్ని ఆరోపణలు టీడీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ పార్టీ పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.


ఇందులో భాగంగా ఓ సమావేశం ఏర్పాటు చేసుకొని మోదీని విమర్శించడం పనిగా పెట్టుకున్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన వారిని వదిలిపెట్టి ఈ వీరిని మనం నాయకులుగా ఎన్నుకున్నాం పేర్కొన్నారు.  గ్రామాలకు కనీసం మూత్రశాలలు కూడా కట్టించడం లేదని వారు ఆరోపించారు.  వాస్తవానికి ఏపీ, తెలంగాణలో బీజేపీకి ప్రాతినిథ్యమే లేదు. తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలున్నా ఏపీలో మాత్రం అసెంబ్లీ స్థానాలు, ఎంపీ సీట్లు శూన్యం.


త్యాగాలు చేసి 70 ఏళ్లు పరిపాలించిన వారు కూడా మూత్ర శాలలు కట్టించలేదని.. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాకే ఇంటికి రూ. 10వేలు ఇచ్చి మరీ ప్రతి గ్రామంలో వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ స్వచ్ఛ భారత్ నినాదంతో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకున్నారని బీజేపీ సానుభూతి పరులు తెలుపుతున్నారు. చంద్రబాబు పై ఉన్న అభిమానంతో ఎకో సిస్టంతో ఇతరుల మెదళ్లలో తమ భావాలను బలవంతంగా రుద్ది అదే నిజమని నమ్మేలా చేస్తుంటారు. ఇప్పుడు ఇదే పద్ధతిని టీడీపీ నేతలు అమలు చేస్తున్నారు. చూద్దాం ఇది నష్టం చేకురుస్తుందా లేక లాభం కలిగిస్తుందా అని.

మరింత సమాచారం తెలుసుకోండి: