ఆంధ్ర ప్రదేశ్ లో సీఎం జగన్ శత్రువులందరూ ఒక్కటైపోతున్నారు. చంద్రబాబు టీడీపీ, జనసేన పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా పోటీ చేసే క్యాండిడేట్లు కాగా, కొన్ని మీడియా చానళ్లు వీరికి అనుకూలంగా జగన్ కు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. ముఖ్యంగా రామోజీరావు ఈనాడు, టీవీ 5 నాయుడు, మహ టీవీ వంశీ వీరే కాకుండా రఘు రామ కృష్ణంరాజు, సీపీఐ రామకృష్ణ ఇలా జగన్ ను గద్దె దించేందుకు అందరూ ఒక్కటై పోతున్నారు.


కానీ జగన్ ఓంటరిగా పోరాటం చేయడానికే సిద్ధమవుతున్నారు. ఆంధ్రలో గతంలో ఎన్నికలు జరిగిన సమయంలో వైసీపీ ఓంటరిగా పోరాటం చేసి 151 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుని తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. 2014లో త్రుటిలో అధికారం కోల్పోయిన కూడా ఎక్కడా కూడా తన ధైర్యాన్ని కోల్పోకుండా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 2019 లో ఒంటి చేత్తో వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చారు.


కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కి ఎదురుగాలి తప్పదని టీడీపీ, జనసేన నేతలు తెగ ప్రచారం చేస్తున్నారు. దీంతో పాటు జగన్ ను ఓడించేందుకు ఓట్లు చీలిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో ఎక్కడెక్కడ ఓడిపోయారో  ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టి అక్కడ గెలిచేందుకు వ్యుహాలు రచిస్తున్నారు. వీరికి తోడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నిక కావడంతో మొన్నటి వరకు బీజేపీ వైసీపీకి అనుకూలంగా ఉంటుందనే ఆశలు కూడ జగన్ విడిచిపెట్టుకున్నారు.


పురందేశ్వరీ కచ్చితంగా టీడీపీకే మద్దతు ఇచ్చేలా ఉందని వైసీపీ నేతలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా కూడా పురందేశ్వరీ టీడీపీ మనిషి అని వారు విమర్శలు చేస్తున్నారు. పురందేశ్వరీ మాత్రం అవన్నీ వట్టి వార్తలేనని కొట్టి పారేస్తున్నారు. తాను బీజేపీ కి చెందిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిని అని తనకు టీడీపీ నాయకులకు సపోర్టు చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: