ఒకానొక దశలో జనాభా విపరీతంగా పెరిగిపోయారు. ఇది ఇలానే కొనసాగితే భూమంతా మనుషులతో నిండిపోతుంది. కనీసం నిల్చోడానికి కూడా స్థలం దొరకదేమో అని భయపడ్డారు. దీంతో జనాభా నియంత్రణపై దృష్టి సారించారు. అది కొంతమేర విజయవంతం అయింది. అయితే ఇప్పుడు తాజాగా జనం తగ్గడం ఎక్కువ అవుతుంది.  గతంలో ఉమ్మడిఒ కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. అవి క్రమంగా తగ్గుముఖం పడుతూ.. చిన్న కుటుంబాలుగా మారిపోయాయి. ఇప్పుడు ఏకంగా వ్యక్తులుగా మిగిలిపోతున్నారు.


పెళ్లిల పట్ల యువత ఆలోచిస్తున్న విధానం మారిపోయింది.  కొంతమంది పెళ్లిపై నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు.  ఒంటరి జీవితమే మేలు అనే భావన ప్రస్తుత యువతలో కనిపిస్తోంది. దీంతో ఆడపిల్లలు పెళ్లి చేసుకోవడం లేదు. మగ పిల్లలు పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కావాలనుకున్న అమ్మాయి దొరకడం లేదనే భావనతో సమయానికి వివాహం చేసుకోవడం లేదు.  చివరికి వీరిని ఒప్పించి పెళ్లి చేస్తే చాలా వరకు విడాకుల వరకు వెళ్తున్నాయి.  


వీటితో పాటు కొన్ని ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, సెక్స్ సామర్థ్యాలు తగ్గడం వంటి కారణాలతో ప్రపంచ జనాభా తగ్గుతూ వస్తోంది. భారత దేశంలో కూడా పెరుగుదలలో తరుగుదల మొదలైంది. చైనాలో ఇప్పటికే ప్రపంచ జనాభా తగ్గుదల మొదలైంది. దీంతో ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నీ కూడా పిల్లల్ని కనండి ప్రోత్సాహకాలు ఇస్తాం అనే పరిస్థితికి  దిగజారిపోయింది. ఇద్దరి ని కాదు ముగ్గురిని కనండి.. అవసరమైతే రెండు పెళ్లిళ్లు చేసుకోండి వంటి ప్రకటనలు మనకి దర్శనమిస్తున్నాయి.


చైనాలో పెళ్లి చేసుకోకుండానైనా పిల్లల్ని కనడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎక్కువ మంది పిల్లల్ని కంటే మరిన్ని బహుమతులు ఇస్తాం అని రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునివ్వడం మనం చూశాం. అలాగే నియంత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పిల్లల్ని కనండి అని కంట తడి పెట్టుకోవడం ఎవరూ కూడా ఊహించి ఉండరు.  ఎక్కువగా కమ్యూనిస్టు దేశాల్లో జనాభా తగ్గుదల బాగా ఎక్కువగా కనిపిస్తోంది.  వాళ్ల ఆంక్షలు తట్టుకోలేక పిల్లల్ని కనడం మానేశారు. పర్యావసారం జనాభా తగ్గుదల మనం చూస్తున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి: