
కానీ, రెండో సారి(ఈ ఏడాది ఏప్రిల్ నుంచి) బుక్ చేసుకున్న వారికి మాత్రం ఇప్పటి వరకు 25 శాతం మం దికి కూడా సొమ్ములు జమ కాలేదు. ఇది పెద్ద అసంతృప్తిగా ప్రజల మధ్య చర్చకు వస్తోంది. అయితే.. ఎవరూ బయటకు చెప్పడం లేదు. ఇదిలావుంటే.. ఇప్పుడు మరో సూపర్ 6 పథకం అమలుకు సర్కారు రెడీ అయింది. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15000 చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.
అయితే.. తాజాగా సర్కారు ప్రకటించిన విధి విధానాలు.. పథకం అమలుకు అయ్యే నిధుల వ్యయం వంటివి పరిశీలిస్తే.. మాత్రం 2 వేల కోట్ల కోసం.. సర్కారు వెనుకడుగు వేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్ధులకు గాను 8,745 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. నిజానికి ఇది సరిపోయే ఎమౌంట్ కాదు. ఎందుకంటే.. 67,27,164 మంది విద్యార్ధులకు రూ.15000 చొప్పున ఇవ్వాలని అనుకుంటే.. కనీసం 10,900 కోట్ల రూపాయలు అవసరం. అప్పుడే ప్రతి విద్యార్థికీ 15000 చొప్పున దక్కుతుంది.
కానీ, తాజాగా విడుదల చేసిన నిధులు మాత్రం 67,27,164 మంది విద్యార్ధులకు 8745 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే.. ఒక్కొక్కరికీ 12,999.54 రూపాయలు మాత్రమే దక్కుతుంది. దీనిలో మళ్లీ బ్యాంకు ట్రాన్సాక్షన్ చార్జీలను లబ్ధిదారులే చెల్లించాలి. అది రూ.150 వరకు ఉంటుందని అంటున్నారు. ఎలా చూసుకున్నా.. లబ్ధిదారులకు మాత్రం రూ.15 వేలు అందవు.
ఎన్నికల్లో మాత్రం 15000 ఇస్తామన్నారు. ఇలా.. చెప్పిన హామీ ప్రకారం విద్యార్థుల తల్లులకు పూర్తి మొత్తం ఇవ్వాలంటే.. మరో 2000 కోట్లు కేటాయించాలి. కానీ, సర్కారు ఎందుకో వెనుకాడింది. ఫలితంగా ఇంతా చేసి.. ఆ 2 వేల కోట్లు ఇవ్వకుండా రూ.13000లకు పరిమితం అయితే.. గతంలో వైసీపీ చేసినట్టే అవుతుంద ని.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుండడం గమనార్హం. మరి దీనిపై సర్కారు ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు