బాలు.., చిరస్మరణీయ్యుడు :
నలభై రెండు దేశాలు, వివిధ  రాష్ట్రాలలోని 110 తెలుగు సంఘాలు ఒక్కటైతే..  గానకోవిదులు, సాహితీ వేత్తలు,  రాజకీయ సినీ రంగ ప్రముఖలు..ఒకే వేదికను పంచుకుంటే.... సరిగ్గా అదే జరిగింది. అందుబాటులోకి వచ్చిన సాంకేతికత ఒక వైపు,  ఒకరినొకరు  ముఖాముఖి  కలిసేందుకు అడ్డువచ్చే కోవిడ్-19 మరోవైపు..... ఈ నే పధ్యంలో గత ఏడాది దివికేగిన  గాన గాంధ్వర్వుడు  పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం ( ఎస్.పి.బి)వర్ధంతి సభ  విశ్వగాన గాంధర్వ -2021 పేరుతో ఆన్ లైన్ లో జరిగీంది.  సినీ   రచయితలు తనికేళ్ల భరణి, సిరివెన్నెల సీతారామ శాస్త్రీ, తదితరులు బాలసుబ్రమణ్యంతో తమకున్న అభూతులను పంచుకున్నారు.
ఈ కారక్యమాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తన ప్రసంగంలో  ఎస్.పి. బాలసుబ్రమణ్యం గుణ గణాలను సభకు వివరించారు. ఆయనకు పెద్దలంటే ఎంతో గౌరవమని, ఆయన కనబర్చిన అణకువ, వినమ్రతల చాలా గొప్పవన్నారు. తెలుగు రాని వారు ఎందరో కథానాయకులుగా  సినీ పరిశ్రమకు అడుగు పెడితే వారికి తన గొంతుకను అరువుగా ఇచ్చారని, ఒక విధంగా చెప్పాలంటే వారిలోకి  ఎస్.పి.బి పరకాయ ప్రవేశం చేశాడని ఉపరాష్ట్రపతి చెప్పారు. వివిధ భాషల్లో వేలాది పాటలు పాడిన ఆయన భారత దేశంలోని  చాలా కుటుంబాలలో, ఇంకా చెప్పాలంటే  వారి జీవితాలలో చోటు సంపాదించుకున్నారని, ఒక భాగమయ్యారని తెలిపారు.

 భాష , సంస్కుృతుల పట్ల బాలసుబ్రమణ్యంకు, తనకు ఉన్న అభిమానం ఇద్దరినీ దగ్గర చేసిందని అన్నారు. చిన్నారులకు, విద్యను గురువు అందిస్తారని, తల్లితండ్రులు నడవడిక నేర్పుతారని, సంస్కారాన్ని నేర్ప ప్రయత్నం చేసిన  ఎస్.పి.బి చిరస్మరణీయ్యుడని  ఉపరాష్ట్రపతి కొనియాడారు. పాడుతా తీయ్యగా కార్యక్రమంలో  పిల్లలకు సంస్కారాన్ని నేర్పించే ప్రయత్నం చేసిన వ్యక్తి అని కీర్తించారు. ఎస్.పి. బాల సుబ్రమణ్యం జీవితం సినీ  చరిత్రలో ఒకమైలు రాయి వంటిదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు పేర్కొన్నారు.. నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో బిజీగా ఉండే ఉపరాష్ట్రపతి ఈ కార్యక్రమంలో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: