ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్న యాంకర్ ఎవరూ అంటే అంతా ఠక్కున చెప్పే పేరు అనసూయ. బుల్లితెరపై అందాల ఆరబోతతో దూసుకువచ్చిన అనసూయ... ప్రస్తుతం హై పెయిడ్ ఆర్టిస్ట్ జాబితాలో చేరారు. జబర్థస్త్ యాంకర్‌గా బుల్లితెరపై మొదలైన అనసూయ ప్రయాణం... ప్రస్తుతం సినిమాల్లో కూడా ఒక రేంజ్‌లో సాగుతోంది. కొన్ని రోజుల పాటు సినిమా ఫంక్షన్లకు యాంకరింగ్ కూడా చేసిన అనసూయ... ప్రస్తుతం వాటికి దూరంగానే ఉన్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు అనసూయ. ఎవరైనా తన డ్రెస్సింగ్‌పై కామెంట్ చేస్తే మాత్రం వెంటనే స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారు. అది కూడా ఒక రేంజ్‌లో బదులిస్తారు. ఇప్పటికే ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంలో యాంకరింగ్ చేస్తున్న అనసూయ.. అడపాదడపా సినిమాల్లో కూడా చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో స్టార్ ప్రోగ్రాంలో నటించేందుకు రెడీ అయ్యారు.

స్టార్ మా టీవీలో ఇప్పుడు ఓ స్టార్ ప్రొగ్రాం టెలికాస్ట్ అవుతోంది. తెలుగులో మాస్టర్ చెఫ్ అంటూ స్టార్ మా టీవీలో టెలికాస్ట్ అవుతున్న ఈ కార్యక్రమంలో ముందుగా స్టార్ హీరోయిన్ తమన్నా యాంకర్‌గా వచ్చారు. ముగ్గురు స్టార్ చెఫ్‌లు లీడ్ చేస్తున్న ఈ షో ఇప్పటికే ఒక రేంజ్‌లో ఉంది. టీఆర్‌పీ రేటింగ్ కూడా బాగానే ఉంది. ఇక యూ ట్యూబ్ వ్యూస్ కూడా లక్షల్లోనే ఉన్నాయి. స్పాన్సర్లు కూడా పెద్ద ఎత్తునే ఉన్నారు. ప్రారంభమైన నెల రోజుల తర్వాత ప్రొగ్రామ్‌లో మార్పు జరిగింది. సినిమాల కారణంగా ఈ కార్యక్రమం నుంచి తమన్నా తప్పుకున్నారు. ఆమె స్థానంలో అనసూయ ఎంట్రీ ఇచ్చారు. తాజాగా వస్తున్న ఈ ప్రొగ్రాం ప్రోమోలో అనసూయ తళుక్కుమన్నారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ స్టార్ చెఫ్‌లు చలపతి రావు, సంజయ్ తుమ్మా, మహేష్ పడాల వ్యవహరిస్తున్నారు. కాంపిటేటివ్ కుకింగ్ రియాల్టీ షో గా పాపులర్ అయిన ఈ ప్రొగ్రామ్‌ ఇకపై అనసూయ యాంకరింగ్‌తో ముందుకు సాగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: