బంగారం ధరలు మార్కెట్ లో ఎప్పుడూ ఎలా ఉంటాయో అంచనా వెయ్యడం చాలా కష్టం.. రోజు రోజుకు ధరలపై పలు అంశాలు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈరోజు మాత్రం పసిడి ప్రియులకు భారీ షాక్.. బంగారం కొనాలనుకునే వారికి నేడు షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. నిన్న స్థిరంగా వున్న పసిడి ధరలు నేడు మార్కెట్ లో పరుగులు పెడుతుంది..వెండి కూడా అదే దారిలో పెరిగింది. ఈరోజు ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది..అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం ధరలు కిందకు దిగి వచ్చాయని మార్కెట్ నిపునులు అంటున్నారు.. మరి ఈరోజు ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి..


చెన్నై లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలు రూ.48,590 ఉంటే, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,010 వద్ద కొనసాగుతుంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700 వద్ద దూసుకుపోతుంది. ఢిల్లీలొ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000 , 24 క్యారెట్ల పసిడి ధరలు రూ.52,370 ఉంది. అదే విధంగా కోల్‌కతా లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,370గా ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,370 ఉంది.


హైదరాబాద్‌లో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.48,000 ఉందని తెలుస్తుంది.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,370 వద్ద ఉంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,370 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలు రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,370 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి ధరలు చూస్తె పసిడి ధరల దారిలోనె నడిచాయి..వెండిపై రూ. 300 వరకు పెరిగింది.కిలో గ్రాము వెండి ధర రూ. 71,000 అందుకుంది.. బంగారం పెరగడం పై ఎన్నో ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: