నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు ఉదయం లేవగానే టిఫిన్లు మరియు కాఫీలు తాగుతారు. అయితే  ఉదయం లేవగానే... ఇష్టం వచ్చినట్టు ఫుడ్ తినడం కాకుండా కొన్ని టిఫిన్లు మాత్రమే చేయాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి... ఉదయం పూట మెరుగైన ఆహారాన్ని తీసుకుంటే చాలా మంచిదని చెబుతున్నారు. అయితే ఉదయం పూట ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు ఇప్పుడు చూద్దాం.

బ్రెడ్ తినటం : మనం హడావిడిగా.. పని బిజీలో పడిపోయి ఓ బ్రెడ్ అలాగే జాము రాసుకొని తిని వెళ్ళి పోతాం. అయితే బ్రేక్ ఫాస్ట్ గా మనం బ్రెడ్ తింటే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వైట్ బ్రెడ్ లో ఇలాంటి పోషక పదార్థాలు ఉండవని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ఇ ఉదయాన్నే వైట్ బ్రెడ్ అస్సలు కూడా తినకూడదు. వైట్ బ్రెడ్ స్థానంలో మల్టీ గ్రైన్ బ్రెడ్ తింటే ఆరోగ్యం అని వైద్యులు చెబుతున్నారు. ఈ బ్రెడ్ 40 కొవ్వు తక్కువగా ఉండే బట్టర్ వేసుకొని తింటే ఇంకా మంచి ఉపయోగాలు ఉంటాయని చెబుతున్నారు.

పాన్ కేక్స్ ; ఈ పాన్ కేక్స్ చాలామంది ఎగబడి తింటారు. ఈ పాన్ కేక్స్ మనం తినడం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అధిక బరువు మరియు ఒబిసిటీకి దారితీస్తుంది ఈ పాన్ కేక్...

మఫిన్స్ : ఎక్కువ శాతం మంది ఉదయం పూట మఫిన్స్ ను తీసుకుంటారు. ఈ మఫిన్స్ లో... ఎక్కువగా రిఫైన్డ్ చేసిన పిండి మరియు వెజిటేబుల్ ఆయిల్ ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ శాతం చక్కెర ఉంటుంది. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా షుగర్ లాంటి వ్యాధులు తొందరగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.

కాఫీ తాగటం : మనం ఉదయం పూట ఎక్కువగా కాఫీ తాగుతాం. అయితే ఖాళీ కడుపున ఈ కాఫీలు తాగడం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖాళీ కడుపుతో అస్సలు కూడా కాఫీ తాగకూడదు. ఒక వేళ కాఫీ తాగాల్సి వస్తే ఏదైనా తిన్న అనంతరం కాఫీ తాగితే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: